కొడుకు వ్యసనాలకు బానిసయ్యాడు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లు వద్దని వారించినందుకు ఒకే వేటుతో తండ్రిని చంపేశాడు.


వ్యసనాలకు బానిసైన కొడుకును మంచి దారిలో పెట్టాలను కున్నాడు తండ్రి. కొడుకు గ్యాంబ్లింగ్‌లు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి, వాటికి బానిసై పోతుంటే.. అలాంటి చెడు అలావాట్లకు పోవద్దు. అవి మన జీవితాలను నాశనం చేస్తాయని.. వాటి జోలికి పోవద్దని వారించాడు తండ్రి. అయినా వాటికి బానిసైన కొడుకు నాలుగు లక్షలు అప్పు చేసి మరీ జూదమాడి ఆ నాలుగు లక్షలు పోగొట్టాడు. ఎంతైనా కొడుకే కదా అనుకున్న తండ్రి కష్టమ్మీద తన కొడుకు చేసిన నాలుగు లక్షల అప్పును తీర్చాలి అనుకున్నాడు తండ్రి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ జూదాలకు బానిసవుతున్నకొడుకును పలు మార్లు మందలించాడు. అప్పులు చేయడం, ఆ డబ్బును బెట్టింగ్‌ల్లో తగలేయడం మంచిది కాదని మందలించాడు తండ్రి. చెడు మార్గంలో ఉన్న కొడుకును మంచి దారిలో పెట్టాలనుకున్నాడు తండ్రి. ఇది కొడుకికి నచ్చ లేదు. తనను మందలించడాన్నికొడుకు జీర్ణించుకోలేక పోయాడు. ఎలాగైనా తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

దీని కోసం యూట్యూబ్‌ను ఆశ్రయించాడు. ఒకే దెబ్బకు ఎలా చంపాలనే దానిపై సెర్చ్‌ చేశాడు. ఆ ప్రకారం ప్లాన్‌ చేసుకున్నాడు. ఇక అదును కోసం చూశాడు. ఈ నెల 8వ తేదీన పొలంలో పని చేసుకుంటున్న తండ్రి వద్దకు వెళ్లాడు. ఒక్క సారిగా క్రూరంగా మారిపోయాడు. కర్ర తీసుకొని ఒకే దెబ్బతో తండ్రిని కొట్టి చంపేశాడు. ఏమి తెలియనట్లే ఇంటికొచ్చేశాడు. అయితే తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయనే డ్రామాకు తెర తీశాడు. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిసి నిరసనలు చేపట్టాడు. తన తండ్రి మృతికి కారకులెవరో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. కొడుకు మీద అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చివరకు అతనే హంతకుడని నిర్థారణ కావడంతో అరెస్టు చేశారు పోలీసులు. అత్యంత దారుణమైన ఈ సంఘటన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలంలో చోటు చేసుకుంది.
ఎన్టీఆర్‌ జల్లా నందిగామ మండలం మొర్సుమల్లి శివారు ములకలపెంట గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావుకు పుల్లారావు కొడుకున్నాడు. పేకాటకు, ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లకు అలవాటు పడ్డాడు. నిత్యం వాటిల్లో మునిగి తేలుతుండేవాడు. ఈ క్రమంలో పుల్లారావు ఆన్‌లైన్‌ జూదానికి బానిసగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి ఆన్‌లైన్‌ జూదం ఆడటం మొదలెట్టాడు. ఇలా దాదాపు నాలుగు లక్షలు అప్పు చేసి ఆన్‌లైన్‌ జూదంలో పోగొట్టాడు. అప్పటి వరకు కొడుకు పుల్లారావు ఆన్‌లైన్‌ జూదానికి బాసినయ్యాడనే విషయం తండ్రి శ్రీనివాసరావుకు తెలియదు. పుల్లారావు చేసిన నాలుగు లక్షలు చెల్లించాలని అప్పులిచ్చిన వారు తండ్రి శ్రీనివాసరావును అడగడంతో కుమారుడు పుల్లారావు అసలు రంగు బయట పడింది. దీంతో అప్పులు చెల్లించి, తన కొడుకు పుల్లారావుని మంచి మార్గంలో నడిపించాలని తండ్రి శ్రీనివాసరావు భావించాడు. ఆన్‌లైన్‌ జూదం మంచి కాదు. జీవితాలు నాశనం అయిపోతాయి. వాటికి పూర్తిగా దూరంగా ఉంటే మన జీవితం బాగుటుందని నాలుగు మంచి మాటలు చెప్పాడు. కానీ కొడుకు వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు కనిపించ లేదు. దీంతో నాలుగు లక్షల అప్పు తీర్చేందుకు తండి శ్రీనివాసరావు నిరాకరించాడు. తండ్రి చెప్పిన ఆ మంచి మాటలు ఆన్‌లైన్‌ జూదానికి బానిసైన కొడుకు పుల్లారావుకు నచ్చలేదు.
ఈ నేపథ్యంలో ఎలాగైన తన తండ్రి శ్రీనివాసరావును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎలా చంపితే అనుమానాలు రాకుండా ఉంటాయనే దానిపై ఆలోచనలు చేయసాగాడు. ఒకే దెబ్బకు చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. దీని కోసం పుల్లారావు యూట్యూబ్‌లో సెర్చి చేయడం మొదలెట్టాడు. అలా ఒకే దెబ్బకు చంపేయాలనే దానిపై యూట్యూబ్‌లో చూసి అవగాహనకు వచ్చాడు. ఇక ఒకే బెబ్బతో తండ్రిని చంపేందుకు అదును కోసం కొడుకు పుల్లారావు ఎదురు చూశాడు. తన తండ్రి పొలంలో పని చేస్తున్నప్పుడు చంపేస్తే ఎవరికీ అనుమానాలు రావని భావించాడు.
అందులో భంగా ఈ నెల 8వ తేదీన తండ్రి పొలంలోగా ఉండగా వెళ్లి కర్ర తీసుకొని ఒకే దెబ్బతో చంపేశాడు. ఏమీ తెలియనట్లు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఎమ్మార్వో కార్యాలయంలో పని ఉందని మైలవరం వెళ్లిపోయాడు. పని మీద తాను మైలవరంలో ఉండగా తన తండ్రి శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందని అందరిని నమ్మించాడు. పొలం సరిహద్దు వివాదం ఉన్న చల్లా సుబ్బారావు, అతని అనుచరులే తన తండ్రి శ్రీనివాసరావును చంపినట్లు అబద్దాలు చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. మరో వైపు శ్రీనివాసరావు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో మృతుడు శ్రీనివాసరావు కొడుకు పుల్లారావు వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి శ్రీనివాసరావును తానే హత్య చేసినట్లు కొడుకు పుల్లారావు నేరాన్ని అంగీకరించాడు. తన తండ్రిని చంపేందుకు తాను వేసిన ప్లాన్‌లు, దాని కోసం యూట్యూబ్‌లో వెతికిన, తీరు, హత్య చేసిన విధానం గురించి నిందితుడు పుల్లారావు చెప్పిన విషయాలకు పోలీసులు సైతం విస్తుబోయారు.
Next Story