విద్యార్థులకు అద్భుత అవకాశం.. స్పీకర్ కీలక నిర్ణయం
x

విద్యార్థులకు అద్భుత అవకాశం.. స్పీకర్ కీలక నిర్ణయం

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి పౌరులు, దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టే విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలను నేరుగా చూసే అవకశాన్ని కల్పించారు.


అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి పౌరులు, దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టే విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలను నేరుగా చూసే అవకాశాన్ని కల్పించారు. అన్నీ తెలుసుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవాలని, దానిని ప్రత్యక్షంగా చూస్తే దాని ప్రభావం బాగుంటుందని ఆయన చెప్పారు. ఈ మేరకు నిర్ణయాన్ని ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో వెల్లడించారు.

వంద మందికి అవకాశం

చట్టసభలు ఎలా పనిచేస్తాయనే అంశంపై విద్యార్థులకు అవగాహన ఉండాలని, అది ఎంతో ఉపయోగకరమైన నాలెడ్జ్ అని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయ్యన్నపాత్రుడు వివరించారు. అందుకోసమే ప్రతిరోజు నిర్దేశిత మంది విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకునే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి. వాటి విధివిధానాలేంటి అన్న విషయాలను విద్యార్థులు తప్పకుండా తెలుసుకోవాలని, వారికి ఆ అవకాశం కల్పించాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారాయన.

సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు

గడిచిన మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలను వివిధ కాలేజీలకు చెందని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. గురువారం.. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు వంద మంది సమావేశాలను చూశారు. అనంతరం ఈ అనుభూతి చాలా బాగుంది. శాసనసభ ఎలా పనిచేస్తుందన్న అన్న అంశంపై అవగాహన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలను టీవీల్లో చూడటం తప్ప.. ప్రత్యక్షంగా చూసింది లేదని అన్నారు. ఇలా ప్రత్యక్షంగా చూడటం వల్ల చాలా కొత్త విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు చెప్పారు. తమకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు.

Read More
Next Story