SRIRANGAM | తిరుచానూరు అమ్మవారి పల్లకిమోతలో  శ్రీరంగం శ్రీవైష్ణవులు
x
పద్మావతి అమ్మవారి వాహనం మోస్తున్న శ్రీరంగం నుంచి వచ్చిన శ్రీవైష్ణవులు

SRIRANGAM | తిరుచానూరు అమ్మవారి పల్లకిమోతలో శ్రీరంగం శ్రీవైష్ణవులు

వాహనసేవలకు టీటీడీలో మోతగాళ్లు ఉన్నారు. ఆ స్థానంలో తమిళనాడులోని శ్రీరంగం వైష్ణువులు ఆ సేవల వెనక నేపథ్యం ఏమిటంటే..


వారంతా శ్రీవైష్ణవులు. ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. అవన్నీ పక్కకు ఉంచిన వారంతా తిరుచానూరు అమ్మవారి పల్లకీ సేవలుగా మారారు. టీటీడీ వాహనబేరర్లను పక్కన ఉంచి తమిళనాడు (TAMILANADU)లోని శ్రీరంగం (SRIRANGAM) పట్టణం నుంచి వచ్చిన శ్రీవైష్ణవులే పల్లకీ మోస్తున్నారు. 32 సంవత్సరాలుగా కార్తీకమాసంలో నిర్వహించే తిరుచూనూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వారంతా వస్తున్నారు.

"సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దేవేరి శ్రీపద్మావతి అమ్మవారిని మా భుజస్కందాలపై మోస్తున్నాం" ఇది మాకు దక్కిన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాం" అని శ్రీరంగం శ్రీవైష్ణవ బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంతన్ అంటున్నారు.

వీరు పల్లకీసేవలో వాహనబేరర్లుగా సేవలు అందించడం వెనుక చారిత్రక నేపథ్యం కూడా ఉంది.
వైష్ణవ ఆలయాలకు కేంద్రం
వైష్ణవ ఆలయాలకు మూలం శ్రీరంగంలోని రంగనాథుడి ఆలయం. ఆ ఆలయంతో తిరుమల శ్రీవారి క్షేత్రానికి అనుబంధం ఉందనేది చారిత్రక కథనం.

అది1679 శతాబ్దం ఔరంగజేబు కాలంలో ఆయన సేనలు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీరంగనాథుడితో్ పాటు ఉభయ నాంచారుల విగ్రహాలను తిరుమలకు తీసుకుని వచ్చి భద్రపరిచారు. ఈ విషయం తెలిసిన ఔరంగజేబు తిరుమల ఆలయంపైకి దండయాత్రకు వచ్చారంట. తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో హిందువులే కాదు. ముస్తింలు కూడా అడ్డుచెప్పారంట. శ్రీవెంకటేశ్వరుడి భార్యల్లో బీబీనాంచారి కూడా ఉన్నారు. అని గుర్తు చేశారంట. అంతే, దండయాత్రకు చేయడానికి వచ్చిన ఔరంగజేబు శాంతించి, వెనుదిరుగుతూ, శ్రీవేంకటేశ్వరుడిని అల్లుడిగా పరిగణించి ఓ కాసులహారం సమర్పించి తిరిగి వెళ్లిపోయారనేది కథనం.
టీటీడీలో ఇప్పటికీ ఔరంగజేబు కానుకగా సమర్పించిన హారం ఉండడం గమనార్హం.
ఆ తరువాత ఉభయ నాంచారులతో పాటు శ్రీరంగనాథుడి ఉత్సవమూర్తులను తిరిగి శ్రీరంగం చేర్చడం ద్వారా వైష్ణవాలయాలకు కేంద్రంగా ఉన్న ఆ ప్రాంత విశిష్టతకు తిరుమల రక్షణగా నిలిచిందినేది ఓ కథనం. దీంతో అప్పటి నుంచి తిరుమలలో ఉత్సవాలు జరిగితే శ్రీరంగం నుంచి కానుకలు అందుతాయి. అక్కడ విశిష్ట కార్యక్రమాలకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా కానుకలు, పూజసామగ్రి తీసుకుని వెళ్లి, సమర్పించడం ఆనవాయితీగా మారింది. ఇదిలావుంచితే...
చారిత్రక వారసత్వ సంపద, ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని శ్రీరంగం నుంచి వచ్చే శ్రీవైష్ణవులు కొనసాగిస్తున్నారు. శ్రీరంగనాథుడికి ఆశ్రయం ఇచ్చిన తిరుమల శ్రీవారి పట్టపురాణి వాహనవలో పల్లకీని మోస్తూ, తరిస్తున్నారు. ఈ ఏడాది కూడా..
అమ్మవారిసేవలో శ్రీరంగం శ్రీ‌వైష్ణ‌వులు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సేవల్లో అమ్మవారి వాహనాలను మోస్తున్నది తమిళనాడులోని శ్రీరంగంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన శ్రీవైష్ణవులు 32 ఏళ్లుగా విశేషసేవలు అందిస్తున్నారు.
2.5 టన్నుల బరువు మోస్తూ..


అమ్మవారి వాహనం మోతాదుకు మించి బరువు ఉన్నా భక్తిభావంతో అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లును, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డపట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పెట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు, వీటి అన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు రెండున్నర టన్నుకు పైగా బరువు ఉంటుంది. ఉదయం, రాత్రి వాహనసేల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటలు పాటు బరువును మోస్తూ వాహన బ్యారర్లు తమ భక్తి భావాన్ని చూపుతున్నారు. మూడు గంటలపాటు అమ్మవారి ఉత్సవమూర్తి, అర్చకులు, కూర్చున్న పల్లకీని భుజాలపై మోస్తున్నారు.
నడుచుకుంటూ భుజం మీద మోస్తూ నాలుగు మాడా వీధుల్లో తిరగడం అంటే సాధారణ విషయం కాదు, వాహన బేరర్లు తమ భుజాలపై మోయడం వల్ల భుజంపై ఉబ్బి కాయకాసినట్లు అనిపిస్తుంది. వారికి ఏమాత్రం తీసిపోని విధంగా శ్రీరంగం నుంచి వచ్చిన వైష్ణవులు అమ్మవారి సేవలో తరిస్తున్నారు.
అమ్మవారి పల్లకీ మోయడంపై ఈ బృందానికి సారధ్యం వహిస్తున్న కాంతన్ ఏమంటున్నారంటే..
"అమ్మవారి వాహనసేవ కైంకర్యంలో 32 ఏళ్లుగా పాల్గొంటున్నాం. ఈ బృందంలో 52 మంది ఉన్నారు" అని కాంతన్ తెలిపారు. "పల్లకీసేవకు వస్తున్న వారంతా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటీ రంగంలో నిపుణులు, రైల్వే ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్న వారే" అని వివరించారు. వారందరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. అని చెప్పారు.
కాంతన్ ఇంకా ఏమి చెబుతున్నారంటే..


శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయంలో కూడా మేము వెసులుబాటు ఉన్నవారందరూ వాహన సేవలో పల్లకీ మోస్తాం" అని చెప్పారు. "వాహనం మోసేటప్పుడు అడుగు వేయడంలో నాలుగు రకాల విధానాలు పాటిస్తాం" అని చెబుతున్న కాంతన్, దీనికోసం ప్రత్యేకంగా నైపుణ్యం అలవాటు చేసుకున్నాం. కొత్తవారికి మెలకువలు నేర్పించామని వివరించారు.
ఇప్పుడెలా వచ్చారంటే...
"ఉద్యోగాలు, విధులు ఏడాడి పొడవునా ఉంటాయి. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు వస్తున్నారంటే మా వాళ్లంతా సెలవులు తీసుకుంటారు" అని చెప్పారు. టీటీడీ ఉచితంగా బస, భోజనం వసతి కల్పిస్తోంది. వస్త్ర బహుమానం ఇస్తోంది. ప్రయాణ ఖర్చులు చెల్లిస్తోంది" అని చెప్పారు.


Read More
Next Story