వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లాలో రాళ్ల దాడి సంఘటన చోటు చేసుకుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోని పోలీసు కేసులు తెరపైకి తోడుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యాలయాలపై కేసు, సోషల్ మీడియా కేసు, సినీ నటి కాదబంరి జెత్వాని కేసు వంటి అనేక కేసులను తెరపైకి తెచ్చారు. వీటిల్లో అనేక మందిపై కేసులు నమోదు చేశారు. అధికారులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేసు తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసును తాజాగా తెరపైకి తెచారు. జగన్ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించిన సందర్భంలో వాహనంపై చంద్రబాబు అభివాదం చేస్తూ వస్తుండగా వీధి లైట్లు తీసేసి, రాళ్ల దాడికి పాల్పడ్డారు. నందిగామ స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యురిటీ అధికారి మధుసూదనరావుకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘన చోటు చేసుకున్న నాడే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్కన పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసును సీరియస్‌గా దీసుకుంది. దీనిని తెరపైకి తెచ్చారు. ఈ కేసులో ముగ్గురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుక్నుట్లు తెలిసింది. నందిగామకు చెందిన కనికంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్‌లను పోలీసులు అపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాల్లో విచారణలో వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.