చిత్తూరులో మరో ఘోరం.. ప్రసవించి ప్రాణం విడిచిన విద్యార్థిని
x

చిత్తూరులో మరో ఘోరం.. ప్రసవించి ప్రాణం విడిచిన విద్యార్థిని

చిత్తూరులో జరిగిన సంఘటన కలకలం రేపింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.


చిత్తూరు జిల్లా లో యువతి యాసిడ్ దాడికి గురైన సంఘటన మరువకముందే.. మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ రాక్షసత్వానికి విద్యార్థిని గర్భం దాల్చింది. మగబిడ్డకు జన్మఇచ్చిన ఆ బాలిక తిరుపతి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. ఆ బాలిక జన్మనిచ్చిన మగ బిడ్డను తిరుపతి రుయా ఆసుపత్రి ఐసీయులో ఉంచారు. ఈ పాపానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పలమనేరు సీఐ నరసింహారాజు ' ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ వడ్డూరుకు చెందిన ఓ బాలిక సమీపంలోని పెంగరకుంటలోని జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. పాఠశాలకు సెలవు ఇచ్చినప్పుడు గ్రామంలోని ఓ మహిళతో కలిసి పశువుల కాయడానికి వెళ్ళేదని చెబుతున్నారు. అభం శుభం తెలియని బాలిక అనే విచక్షణను ఆ మహిళ కోల్పోయింది. తనకు తెలిసిన ఓ కామాంధుడి వశం చేసింది. ఇలా అనేక దఫాలు జరిగినట్లు చెబుతున్నారు. దీంతోనే ఆ బాలిక గర్భం దాల్చినట్లు సందేహిస్తున్నారు.

ఇందులో వాస్తవ విరుద్ధమైన విషయాలు ఉన్నాయి అని నరసింహరాజు చెబుతున్నారు. " బాలిక గర్భం దాల్చడానికి కారణమైన సందేహిస్తున్న వారికోసం పెంగరకుంట గ్రామంలో విచారణ చేస్తున్నాం" అని సీఐ నరసింహారాజు చెప్పారు.

పాఠశాలల్లో కొరవడిన నిఘా

రాష్ట్రంలోని కొన్ని గురుకుల పాఠశాలలు. ఇతర హాస్టల్ లో కూడా కొందరు విద్యార్థినులు లైంగిక దాడుల నేపథ్యంలో గర్భం దాల్చిన సంఘటనలు ఆందోళన గురి చేసిన విషయం తెలిసిందే. ప్రకాశం, కర్నూలు జిల్లాలో కూడా అమ్మాయిలు బాత్రూంలో ప్రసవించిన సంఘటనల ద్వారా విద్యాసంస్థల్లో జరిగిన ఘటనల తరువాత కూడా పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు.

పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడం ఒక కారణమైతే, విద్యా సంస్థ నిఘ లేకపోవడం కూడా మరోసారిగా మారింది.

"రాష్ట్రంలోని బీసీ బాలికల హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. తరచూ పరిసరాల్లో పోలీసులు గస్తీ దానికి కూడా చర్యలు తీసుకుంటాం" అని కొన్ని రోజుల కిందట తిరుపతిలో జరిగిన సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితమ్మ స్పష్టమైన ప్రకటన చేశారు.

మంత్రిగా ఆమె బాధ్యతాయుతంగా ప్రకటన చేశారనడంలో సందేహం లేదు. అయితే, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు విద్యాసంస్థలు, హాస్టలలో ఆ దిశగా పగడ్బందీ చర్యలు లేవనే విషయం మరోసారి స్పష్టమవుతుంది. చిత్తూరుకు సమీపంలో పదో తరగతి విద్యార్థిని తాజాగా ప్రసవించిన సంఘటన సాక్ష్యమే కాదు. కలకలం చెలరేగింది.

ఏమైందంటే..

చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని టీ వడ్డూరు వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని 10వ తరగతి చదువుతోంది. ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విద్యార్థిని మరణించింది. బిడ్డ మాత్రం తిరుపతి రుయా హాస్పిటల్ ఐసీయూలో ఉంచారు. ఈ ఘటనతో చిత్తూరులో కలకలం రేగింది.

ఈ పాపం ఎవరిది?

పాఠశాలలో చదువుతున్న బాలిక ప్రసవించింది. అంటే, ఈ పాపానికి కారణమైన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతనిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, అభం శుభం తెలియని బాలిక గర్భం దాల్చిన సంఘటన ద్వారా పాఠశాలల్లో తీసుకోవలసిన భద్రత అంశాలు మరోసారి తిరమీదికి వచ్చాయి. ఆ విద్యార్థిని తనకు జరిగిన అన్యాయంపై ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఏర్పడిందా? అదే వాస్తవమైతే, నెలలు నిండే కొద్ది ఆ బాలికలు చోటుచేసుకుంటున్నా మార్పులను కూడా గమనించలేకపోవడం అనేది దారుణమైన విషయం.

ఏమి జరిగింది

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ. ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విధారక సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక పలమనేరు సమీపంలోని పెంగకుంట జడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఆ బాలికకు రెండు నెలల కిందట ఉదర భాగం పెరగడానికి గమనించిన టీచర్ తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులను బడి మాన్పించారు. అయితే శనివారం ఉన్నట్టు ఉండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో ఆందోళనతో తల్లిదండ్రులు బంగారుపాలెం ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు.

దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు

బంగారుపాలెం వైద్యులు ఆ బాలికను పరీక్షించారు. అనంతరం ఆ బాలిక ఆరు నెలల గర్భిణి అనే విషయం చెప్పడంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రక్తహీనతతో ఉన్న ఆ బాలికను వైద్యుల సూచన మేరకు చిత్తూరు జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ గర్భంతో ఉన్న బాలికను పరీక్షించిన వైద్యులు రక్తహీనత కారణంగా ఊపిరితిత్తులో నెమ్ము చేరింది. గర్భంలో ఉన్న బిడ్డను బయటికి తీస్తే మినహా బాలిక ప్రాణాలకు గ్యారెంటీ లేదని తేల్చి చెప్పారు.

మగబిడ్డ కు జన్మ

అధికారుల ఆదేశాలతో గర్భంతో ఉన్న బాలికకు సిజేరియన్ చేశారు. కా బాలిక మగ బిడ్డకు జన్మ ఇచ్చింది. ప్రసవించిన బాలిక ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి ఎస్ వి ఆర్ ఆర్ ( Sri Venkateswara Ram Narayan Ruya hospital,- SVRR) ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో ప్రసవించిన బాలికను వెంటిలేటర్ పై ఉంచి శనివారం రాత్రి చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకువచ్చారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక ప్రాణాలు విడిచింది. ఆమె ప్రసవించిన మగ బిడ్డను ఐసీయూలో ఉంచారు.

"ఈ ఘటనపై చట్టం కింద కేసు నమోదు చేసాం" అని పలమనేరు సీఐ నరసింహారాజు తెలిపారు. జరిగిన సంఘటనపై కలెక్టర్ సుమిత్ కుమార్ విచారణకు ఆదేశించారు.ఈ ఘటనపై పలమనేరు సీఐ నరసింహారాజు ఏమంటున్నారంటే... "ఆ బాలిక ప్రస్తుతం పదో తరగతిలో ఉంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక కొద్దిరోజులు బడికి వెళ్ళింది. ఆ తర్వాత చదువు ఆపేసింది" అనే విషయం పాఠశాల ప్రిన్సిపాల్ ద్వారా స్పష్టమైందని చెప్పారు.

పెంగరకుంట గ్రామంలో ఉన్న వారందరూ వడ్డెరలే. రాళ్లు కొట్టుకునే పనికి వెళతారు. గర్భం దాల్చిన బాలిక తల్లిదండ్రులకు కూడా అదే వృత్తిగా జీవిస్తున్నారు. అని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో గ్రామంలో ఉన్నవారు వంట చెరుకు కోసం సమీపంలోని అడవికి వెళతారు. ఆ సందర్భంలోనే ఓ మహిళ ఈ బాలికను మరో వ్యక్తికి అప్పగించిందని చెప్పడంలో ఆధారాలు లేవు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళ కూడా బాధితురాలికి సమీప బంధువు అని ఆయన వివరించారు. "బాలిక గర్భం దాల్చి, ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన నిందితుల కోసం విచారణ జరుగుతోంది" అని సీఐ నరసింహారాజు స్పష్టం చేశారు. చిత్తూరు డిఎస్పి సారధ్యంలో విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెబుతున్నారు. ఏది ఏమైనా, బాలిక గర్భం దాల్చిన సంఘటనతో పలమనేరు ప్రాంతమే కాదు చిత్తూరు జిల్లాలో కలకలం చెలరేగింది. అధికారులు కూడా హైరానా పడుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై జిల్లా అధికారులు ఎలా స్పందిస్తాం అనేది వేచి చూడాలి.

Read More
Next Story