
Central University | అనంతపురం: రక్షణ కల్పించాలటున్న విద్యార్థినులు
రక్షణ కల్పించాలని సెంట్రల్ వర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. విసీతో పాటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనతో సోమవారం మధ్యాహ్నం అట్టుడికింది. యూనివర్సిటీలో రక్షణ కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో తమకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్ ఆవరణలోకి ఆగంతకులు వస్తున్న, నివారించే దిక్కులేదు. ఈ పరిస్థితుల్లో మాకు రక్షణ లేకుండా పోయిందని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కూడా స్పందించారు. యూనివర్సిటీకి వెళ్ళిన వారు విద్యార్థులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసి ( Central University vice chancellor) ఎస్ ఏ కోరి పై కూడా ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్యలను మరోసారి కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా 2018లో అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటయింది. సింగనమల నియోజకవర్గం జంతలూరు వద్ద యూనివర్సిటీ ప్రారంభించారు. వర్సిటీలో అకాడమి క్ భవనం తో పాటు హాస్టల్ లో 2100 మంది విద్యార్థులకు బోధనలకు వీలుగా ఏర్పాటు చేశారు. దేశంలోని 21 రాష్ట్రాల నుంచి 668 మంది విద్యార్థులు ఎన్రోల్ అయినట్లు సెంట్రల్ వర్సిటీ వెబ్సైట్ స్పష్టం చేస్తుంది. కాగా, ఇక్కడ ఇంకా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. భవన నిర్మాణం కోసం బీహార్ ప్రాంతానికి చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. కాగా వారిలో కొందరి నుంచి తరచూ సమస్యలు తలచిత్తుతున్నాయనే విషయాన్ని విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తాజాగా
విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి సంఘాల నాయకులు కాదు కదా. మీడియాను కూడా అనుమతించడం లేదు. సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో వసతులు కూడా అందుబాటులో లేవు అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుళాయి స్వామి చెప్పారు. "వర్సిటీ ఆవరణలో ఇంకా భవన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇక్కడ పనిచేయడానికి బీహార్ ప్రాంతానికి వచ్చిన కూలీలు ఉన్నారు. వీరిలో కొందరి వల్లే కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్టు తమ దృష్టికి కూడా వచ్చింది" అని కుళాయి స్వామి చెప్పారు.
విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదంటూ వసతి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఏపీ గవర్నర్ తో పాటు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కూడా లేఖ రాశానని చెప్పారు. మరోసారి ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకో వెళ్లడం ద్వారా పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు భద్రత కల్పించడంతోపాటు నిఘా ఏర్పాటు చేయడానికి నాణ్యమైన భోజనం వడ్డించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అధికారులు ఆదేశించారు.