మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఘటనపై స్పందించి, డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక హెలికాప్టర్లలో పంపిన ప్రభుత్వానిక ఈ చిన్నా ఘటన కనిపించడం లేదా?


పుంగనూరులో ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్‌ చేసి హత్య జరిగితే ఎవరూ పట్టించుకోలేదని, ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగ లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హత్యకు గురైన అస్పీయ కుటుంబ సభ్యులును మాజీ మంత్రి, ఎమ్మేల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆస్పియ తండ్రి హాజ్మతుల్లకు ధైర్యం చెప్పి, ఓదార్చారు. ఇది అత్యంత దారుణ ఘటన అని, ఈ దుర్మార్గానికి పాల్పడిన దోషులకు శిక్ష పడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించక పోతే, పోలీసులు అసమర్థతపై తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు.

మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులకు స్పెషల్‌ విమానం, ప్రత్యేక హెలికాప్టర్‌లు ఇచ్చి పంపించిన ప్రభుత్వానికి, ఈ చిన్నారి ఘటనపై ఎందుకు స్పందించడం లేదని, ఈ దుర్మార్గం ప్రభుత్వానికి, పోలీసులు, ఉన్నతాధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈనెల 9వ తేదిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు. పరామర్శ అనంతరం పుంగనూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్‌లో బయలుదేరి అక్కడి నుంచి విమానంలో విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారని పెద్దిరెడ్డి చెప్పారు. ఈ దుర్మార్గ ఘటనపై వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.


Next Story