ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. నాలుగు రోజులు బయటక రావద్దు..!
x

ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. నాలుగు రోజులు బయటక రావద్దు..!

ఆంధ్ర ప్రజలకు రాష్ట్ర విపత్తుల సంస్థ పిడుగులాంటి వార్త చెప్పింది. నాలుగు రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.


వేసవి మంటలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఏరోజుకు ఆ రోజు మునుపటి రోజు రికార్డును అధిగమిస్తూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ మండుటెండల్లో చల్లదనం కోసం ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఏసీలు, కూలర్లకు అతుక్కు పోతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఆంధ్ర విపత్తుల సంస్థ పిడుగులాంటి వార్త చెప్పింది. నాలుగు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత పెరగనున్నాయని, వడగాలుల తీవ్రత కూడా అదే స్థాయిలో పెరిగే అంచనాలు ఉన్నాయని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ రోజు 34 మండలాల్లో తీవ్రస్తాయి వడగాలులు వీస్తాయని, అదే విధంగా సుమారు 216 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీస్తాయని సంస్థ అంచనా వేసినట్లు ఆయన వివరించారు.

మండలాలు ఇవే

ఈరోజు రాష్ట్రంలో తీవ్రస్తాయిలో వడగాలులు వీచే మండలాల జాబితాలో శ్రీకాకులంలో 6, విజయనగరంలో 16, పార్వతీపురం మన్యంలో 12 మండలాలు ఉన్నాయి. అదే విధంగా ఒకమోస్తరు వడగాలులు వీచే మండలాల్లో.. శ్రీకాకుళం 15 , విజయనగరం 9, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 1, అనకాపల్లి 15, కాకినాడ 12, కోనసీమ 3, తూర్పుగోదావరి 15, ఏలూరు 8, కృష్ణా 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 21, బాపట్ల 6, ప్రకాశం 22, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 18, శ్రీసత్యసాయి 2, తిరుపతి 12, అనంతపురం 4, అన్నమయ్య 3, చిత్తూరు 1, వైయస్సార్ 8 మండలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లొద్దని కూర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు.

వాళ్లు చాలా జాగ్రత్త

ఎండల తీవ్ర పెరగనున్న క్రమంలో ఎవరూ బయటకు రాకుండా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు వీలైనంత మేర నీడపట్టున ఉండటానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. అందులోనూ ఈ వడగాలలు వీచే జిల్లాల్లోని వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, తమ మండలాల్లో వడగాలులు లేనప్పటికీ వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని, గాలిలో తేమ శాతం తగ్గికి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే వృద్దులు, బాలింతలు, గర్మిణులు, చిన్నారులు మరింత జాగ్రత్త పాటించాలని, వారు వీలైనంతగా చల్లటి ప్రాంతాల్లో గడపాలని, ఇంట్లో చల్లగా ఉండేటా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా ఈ జాగ్రత్తలను నాలుగు రోజుల పాటు పాటించాలని సూచించారు. అందుకు నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీ పెరగనుండటమేనని కారణమని చెప్పారు.

రాష్ట్రంలో ఉష్ణోగ్రత్తలు ఇలా..!

ఈరోజు అంటే బుధవారం (మే 1వ తేదీ)న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్సార్,తిరుపతి జిల్లాల్లో ఎండలు సుమారు 45°C-47°C మధ్య అవకాశం ఉందని వెల్లడించారు. అదే విధంగా కాకినాడ, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు,బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల మధ్య, కోనసీమ, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే 02 గురువారం

విజయనగరం, పార్వతీపురంమన్యం, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ ,పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే 03 శుక్రవారం

పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే 04 శనివారం

విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Read More
Next Story