పిటీషనర్‌పై ప్రచురించే కథనాలపై పరిణామాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొంటూ విచారణను ఈ నెల 16కి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు.
తప్పుడు కథనాలను ప్రచురించాయని పేర్కొంటూ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు జారీ అయ్యాయి. ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసు తర్వాత పిటీషనర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాసే కథనాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఆదానితో జరిగిన ఒప్పందాలకు సంబంధించి అడ్డుగోలుగా అథనాలు రాశాయని, అవన్నీ నిరాధారమైనవని పేర్కొంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరువు నష్టం దావా పిటీషన్ దాఖలు చేశారు. ఆదాని గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో వచ్చిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా.. ఉన్నట్లుగా కట్టు కథలు రాశారని, ఈ మేరకు భేషరతుగా క్షమాపణలు చెప్పక పోతే రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఈనాడు, ఆంధ్రజ్యోతిలను హెచ్చరించారు. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతిల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జగన్ చెప్పిన మేరకు ఆ రెండు పత్రికలకు లీగల్ నోటీసులు పంపారు. తనపై వ్యతిరేకంగా ప్రచురించిన కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు సమన్లు జారీ చేసింది. సమన్లు తర్వాత పిటీషనర్‌పై ప్రచురించే కథనాలపై పరిణామాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని హెచ్చరించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
Next Story