వైసీపీ నేతలకు మధ్యంతర రక్షణ.. ఆదేశించిన సుప్రీంకోర్టు
x

వైసీపీ నేతలకు మధ్యంతర రక్షణ.. ఆదేశించిన సుప్రీంకోర్టు

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు వ్యవహారం వైసీపీ మెడలో ఉచ్చులా మారింది. ఈ కేసు విచారణ జరుగుతున్నా కొద్దు ఉచ్చు బిగుస్తూ వచ్చింది.


టీడీపీ ఆఫీసుపై దాడి కేసు వ్యవహారం వైసీపీ మెడలో ఉచ్చులా మారింది. ఈ కేసు విచారణ జరుగుతున్నా కొద్దు ఉచ్చు బిగుస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసులో వైసీపీ నేతలకు తొలిసారి కాస్తంత ఊరట లభించింది. హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. వైసీపీ నేతలకు తీపి కబురు చెప్పింది. ఒకపై వారిద్దిరికీ రక్షణ కల్పించాలని చెప్తూనే వారు కూడా ఈ కేసు విచారణకు పూర్తి సహకారం అందించాలని సూచించింది. అంతేకాకుండా దేవినేని అవినాష్, జోగి రమేష్ ఇద్దరూ కూడా తమ పాస్‌పోర్ట్‌లను అధికారులకు హ్యాండోవర్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి దేవినేని అవినాష్, జోగిరమేష్‌లకు మినహాయింపు లభించినప్పటికీ పాస్‌పోర్ట్‌లో స్వాధీనం చేయడం వారిని ఆదేశించడం కీలకంగా మారింది.

వారిద్దరే కాదు..

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్‌తో పాటు లేళ్ల అప్పిరెద్ది, తలశల రఘురాంకు కూడా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగా వీరంతా కూడా తమ పాస్‌పోర్ట్‌లను 48 గంటల్లోగా అధికారులకు హ్యాండోవర్ చేయాలని, ఈ కేసు విచారణకు నలుగురూ తమ సంపూర్ణ సహకారం అందించాలని సూచించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ విషయంపై నవంబర్ 4న స్పష్టత రావొచ్చని వైసీపీ తరపు న్యాయవాది కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లూత్రా అభిప్రాయడ్డారు. దీంతో అప్పటి వరకు ఈకేసు నిందితుల అరెస్ట్ కార్యక్రమం ఏపీలో కొనసాగే అవకాశం ఉంది.

ఇంతకీ హైకోర్టు ఏమందంటే..

టీడీపీ కార్యాలయంపై, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేతలు, కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళతామని, అందుకుగానూ తమకు అరెస్ట్ నుంచి రెండు వారాల మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. అందుకు వ్యతిరేకంగా టీడీపీ తరపు న్యాయవాది వాదనలు వినిపించడంతో అందుకు కూడా హైకోర్టు ససేమిరా అంది. దీంతో వీలైనంత త్వరగా సుప్రీంకోర్టు ఆశ్రయించారు వైసీపీ నేతలు. కాగా వారికి అక్కడ కాస్తంత ఊరట లభించినట్లయింది.

Read More
Next Story