చంద్రబాబు ‘స్కిల్ స్కామ్’ పై సుప్రీం భిన్నమైన తీర్పు
x

చంద్రబాబు ‘స్కిల్ స్కామ్’ పై సుప్రీం భిన్నమైన తీర్పు

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు భిన్నమైన తీర్పును వెలువరించారు.


స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి నిరాకరించిన హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ అనిరుద్ద బోస్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును వెలువరించింది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) వివరణ, వర్తింపు పై న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చట్టంలోని నిబంధన ప్రకారం ప్రభుత్వ అధికారి ఏదైన తప్పు చేసినప్పుడు విచారణ అధికారి(పోలీసులు, దర్యాప్తు సంస్థలు), తప్పు చేసిన అధికారికి సంబంధించిన ఉన్నతస్థాయి అధికారి అనుమతి తీసుకోవాలని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) ను జూలై 26, 2018 న తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ బోస్ మాట్లాడుతూ " చంద్రబాబు నాయుడును విచారణ చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి" అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ ను మాత్రం ఆయన సమర్ధించారు. అలాగే జస్టిస్ బేలా త్రివేదీ హైకోర్టు ఆదేశాలను సమర్ధించారు.

పరస్పరం విరుద్దమైన అంశాలను ముందుకు తెచ్చినందువల్ల చీఫ్ జస్టిస్ ముందుకు ఈ అంశాన్ని తీసుకెళ్తామని న్యాయమూర్తులు తెలిపారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ లో రూ. 371 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపించింది. గత ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన నిధులను 2015లో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాలరీత్యా నవంబర్ 20న రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును కోరగా, న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు ప్రాథమిక దశలో క్రిమినల్ ప్రోసిడింగ్ లను అడ్డుకోకూడదని, ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి నిరాకరించింది. దీనితో టీడీపీ అధినేత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read More
Next Story