498 A | బెంగళూరు టెకీ ఆత్మహత్యతో కదిలిన సుప్రీం చెప్పిందేమిటీ?
x
సుప్రీం కోర్టు . ఆత్మహత్య చేసుకున్న టెకీ సుభాష్ (ఇన్ సెట్)

498 A | బెంగళూరు టెకీ ఆత్మహత్యతో కదిలిన 'సుప్రీం' చెప్పిందేమిటీ?

ఈ సెక్షన్లో మహిళలకు భద్రత ఉంది? పురుషుల పరిస్థితి ఏమిటనేది చర్చకు తెరతీసింది? అలజడి రేపిన బెంగళూరు టెకీ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది.


బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యాయవ్యవస్థను ఆలోచనలో పడేసింది. IPC section 498/A పై సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించింది. హైకోర్టులకు దిశా నిర్దేశం చేసింది. సుభాష్ భార్య పెట్టిన కేసులను సమీక్షించడానికి ఆదేశాలు జారీ చేసింది.

అతుల్ సుభాష్ ఆత్మహత్య ద్వారా వరకట్న వేధింపులే కాదు. గృహహింస చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును ఎత్తిచూపింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో పురుషులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెరపైకి తీసుకువచ్చింది. 498/A కేసుల్లో పోలీసు అధికారుల దర్యాప్తు తీరును కూడా చర్చకు తీసుకువచ్చింది.
ఈ సెక్షన్ మహిళలకు రక్షణ కల్పిస్తోంది. దేశంలో మహిళలకు గౌరవం, సముచిత స్థానం కల్పించాలనే చట్టాలు ఉన్నాయి. వారి హక్కులకు భంగం కలిగించకూడదు. అయితే పురుషాధిక్య సమాజం అంటూ నినదించే, పోరాటాలు సాగించే మహిళా సంఘాలు కూడా ఆలోచన చేయాల్సిన సందర్భాన్ని అతుల్ సుభాష్ ఆత్మహత్య గుర్తు చేస్తోందనడంలో సందేహం లేదు. కుటుంబ వ్యవస్థలో పొరపొచ్చాలు రావడం సహజం. సర్దుకునిపోయే వరకు ఫరవాలేదు. ఆ పరిస్థితి దాటితే తప్పు చేయని పురుషులు కూడా నిందితులుగా నిలుస్తున్నారు. వారితో పాటు తల్లిదండ్రలు, అక్కా, చెల్లి, కుటుంబంలో ఏ తప్పూ చేయని వారికి కూడా కేసులతో వేదన ఎదురువుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం ఎలా? భార్యను నిజంగా వేధిస్తే, శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేయని వారి పరిస్థితి ఏమిటి?
"దీనిపై మదనపల్లె బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది డివి. రమణ ఏమంటున్నారంటే... వరకట్న వేధింపులు. లేదా గృహహింస సెక్షన్ల కింద ఫిర్యాదు చేయగానే.. కేసు నమోదు చేయరు. దంపతులిద్దరికీ జిల్లా కేంద్రంలో కౌన్సిలింగ్ ఉంటుంది. అప్పటికీ వారిద్దరి మధ్య రాజీ కుదరకుంటే, మాత్రమే కేసు నమోదు చేయాలి" అనే మాట చట్టం చెబుతోంది.
"వరకట్నం వేధింపుల కేసులోనూ ఫిర్యాదు అందితే, వెంటనే కేసు నమోదు చేయడం కాదు. నిందితుడిగా ఉన్న భర్తకు 41A నోటీసు జారీ చేయాలి. వాస్తవాలు పూర్తిగా పరిశీలించిన తరువాతే ఫిర్యాదులోని నిందితుల పేర్లు ఉన్న వారిని ఘటనా స్థలంలో విచారణ చేసి, వారి ప్రమేయం లేకుంటే, ఆ విషయాన్ని నిర్ధారిస్తూ దర్యాప్తు అధికారి కేసు నమోదు చేస్తే, సగం వరకు కేసులు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం కావడమే కాదు. కోర్టులకు కూడా భారం తగ్గుతుంది" అని డీవి. రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. బెంగళూరు సంఘటనను ఉటంకిస్తూ, మరణించిన వ్యక్తికి సరైన కౌన్సిలింగ్ జరగకపోవడం లోపం అని అభిప్రాయపడ్డారు.

మానసిక వేదన, కేసులతో తల్లడిల్లిన బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్యహత్య చేసుకున్న ఘటనలో సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో యూపీ హైకోర్టు స్పందించింది. తన భర్త అతుల్ సుభాష్ పై నికిత సింఘానియా 498a తో పాటు మిగతా ఆరోపణలపై నమోదు చేయించిన తొమ్మిది కేసులు సమీక్షకు వచ్చాయి. వాటికి సంబంధించిన మరిన్ని వివరాలను బయటికి తీసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇదిలావుంటే.. బెంగళూరు పోలీసులు అతుల్ భార్య నికిత సింఘానియా, అత్త సోనీ, బామర్ది అనురాగ్ ను అలహాబాద్ లో ఆదివారం ఉదయం బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఏమి జరిగింది?
బెంగళూరు హరితహళ్లి మంజునాథ లేఅవుట్ లో ఉంటున్న అతుల్ సుభాష్ పై భార్య 498a కేసును ఉత్తరప్రదేశ్ లో నమోదు చేయించింది. అది కూడా అతుల్ సుభాష్ నుంచి విడిపోయిన 8 నెలల తర్వాత 498 ఏ కేసు పెట్టింది. తనకు మూడు కోట్ల రూపాయల భరణం కావాలని కూడా తన పిటీషన్ లో కోరింది. తన కొడుకుని కలవడానికి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఈ విధంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నా అతుల్ పై ఉత్తరప్రదేశ్లో దాదాపు పది కేసులు పెట్టింది. దీంతో భార్య, అత్తింటి కుటుంబసభ్యులు పెట్టిన కేసులకు హాజరు కావడానికి బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ కు 40 సార్లు ప్రయాణించాల్సి వచ్చింది. విడాకుల కేస్ తో పాటు పూటకు ఓ కేసు కూడా నమోదు చేయించారు. దీంతో ఈ వేదన భరించలేని అతుల్ సుభాష్ గత ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నాటికి గానీ గుర్తించలేకపోయారనే విషయం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన దేశంలో అలజడి రేపింది.

ఇది దారుణమైన కేసు
మరింత దారుణమైన సంఘటన ఏమిటి అంటే ఈ కేసులో నికిత సంఘానియా తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తన తండ్రి మరణానికి కూడా మాజీ భర్త అతుల్ కారణమని మరో కేసు పెట్టింది. ఈ కేసు సెటిల్మెంట్ చేసుకోవడానికి నిఖిత కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆతులు తన సూసైడ్ నోట్లో ప్రస్తావించాడు. అంటే మొత్తం మీద 498a సెక్షన్ ఉపయోగించుకొని అత్తింటి ఆరళ్లు, వరకట్నం వేధింపులు చేస్తున్నారంటూ ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా దుర్వినియోగం చేయడానికి నిఖిత వ్యవహరించిన తీరు ద్వారా స్పష్టమవుతుంది.
సమర్థనీయం కాదు.. అయితే.
భార్యను హింసించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఈ గృహహింస చట్టంలో మహిళలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయి. అనేది అనేక కేసులు పరిశీలిస్తే అర్థమవుతుంది. తప్పు చేయకున్నా మగవాళ్ళు మాత్రం చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందేనా? చట్టాలను అనుకూలంగా ఉన్నాయని మగవారి స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారికి శిక్షలు ఉండవా అంటే... బెంగళూరు టకీ అతను సుభాష్ ఆత్మహత్యతో సర్వోన్నత న్యాయస్థానం కూడా స్పందించింది.
కరిగిన కలలు
ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకొని ఆనందంగా దాంపత్య జీవితం గడపాలనే కలలు కంటారు. పిల్లలతో సరదాగా ఉండాలని భావిస్తారు. పెళ్లి, పిల్లలు, దాంపత్య జీవితం అంటూ అందరి మాదిరి కలలుగన్న అతుల్ సుభాష్ జీవితం అర్ధంతరంగా ఆగింది.
బెంగళూరు చెందినట్టకి అతుల్ సుభాష్ కూడా సగటు మనిషే. తాను కన్న కలలన్నీ కలలుగా మారాయి. భార్య వేధింపులు. కేసులు. చివరికి తన తండ్రి మరణానికి కూడా భర్త అతుల్ సుభాష్ కారణమని నికతా సింఘానియా పెట్టిన కేసు కూడా రిజిస్టర్ అయింది. అంతకుముందు అసహజ శృంగారం, కట్నం కోసం వేధించాడనే అనేక కేసులు పెట్టింది. పరిహారంగా కోట్లు డిమాండ్ చేసింది. ఈ కేసుల్లో నిజానిజాలు వాస్తవికతను పరిశీలన చేయకుండానే పోలీసులు కేసులు నమోదు చేయడం గమనించతగిన విషయం.
ఈ వేధింపులు భరించలేని అతుల్ సుభాష్ 24 పేజీల సూసైడ్ నోట్ తో పాటు 45 నిమిషాల నిడివి కలిగిన వీడియోను సుప్రీంకోర్టు జడ్జికి పంపించారు.. ఆపాటికే అతను సుభాష్ అర్ధంతరంగా తన జీవితాన్ని చాలించాడు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడమే కాదు 498ఏ కేసు పై సమీక్షకు దిగింది. రాష్ట్రాల హైకోర్టులను కూడా అప్రమత్తం చేసింది. ఇంతకీ ఎవరి అసలు సుభాష్, నికిత సింఘానియా ఎందుకు వేధింపులకు పాల్పడింది. ఈ ఎపిసోడ్లో ప్రాణాలు తీసుకున్న అతుల్ సుభాష్ ఆత్మహత్యపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది?
ఎవరి సింఘానియా
బెంగళూరులో ఐటి ఉద్యోగులకు కంపెనీలకు కొదవలేదు. అలాంటి కంపెనీలో అతుల్ సుభాష్ ఓ టెకి. అదే కంపెనీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నికిత సింఘానియాను 2019లో సుభాష్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు వెళ్ళి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. వారి ఆనందానికి అనుబంధాన్ని పెంచుతూ సింఘానియా ఏడాదన్నర తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చింది. యూపీ (Uttar PRadesh ) ఊరు నుంచి ఏడాదిన్నర తర్వాత 2021లో బాబును ఇంటికి బాబును తీసుకుని వచ్చింది.
అందమైన భార్య. చక్కటి మగబిడ్డ. ఇద్దరిని చూసి సుభాష్ ఎంతో మురిసిపోయారు. తాను కన్న కలలు దేవుడు నిజం చేశాడని సంబరపడిపోయారు. అదే తనకు చివరి ఆనందకరమైన రోజులనే విషయాన్ని సుభాష్ కు తెలియదు. విధిరాత అలా ఉంది. ఎందుకో తెలియదు. ఏమి జరిగిందో?? అతుల్ సుభాష్ తో భార్య నికిత సింఘానియా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో వారిద్దరూ విడిపోయారు.
అక్కడి నుంచి కష్టాలు ప్రారంభం
భార్య నిఖిత సింఘానియా విడిపోయిన తర్వాత అతను సుభాష్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. కేసులు వెంటాడాయి. భార్య నికిత సింఘానియా కేసులు బనాయించడం ప్రారంభించింది. అందులో..
" అసహజ శృంగారం చేయాలని ఒత్తిడి చేశాడు" అనే కాకుండా, కట్నం కోసం వేధించాడు" అంటూ భర్త అతుల్ సుభాష్ పై నిఖిత సింఘానియా కేసులు పెట్టింది. కోట్ల రూపాయలు పరిహారం డిమాండ్ చేసింది. సాధారణ టెకీగా జీవితం సాగిస్తున్న అతుల్ సుభాష్ ఈ కేసులతో దిమ్మదిరిగిపోయింది. తనకు అంత స్థామత లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. "ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కూడా, కేసుల్లో ఎంతమేరకు వాస్తవాలు ఉన్నాయనేది శోధించకుండా రిజిస్టర్ చేశారు."
ఏమి చేయాలో పాలుపోక
ఉద్యోగం చేయకుంటే బతకడం కష్టం. తన నుంచి విడిపోయిన భార్య పెట్టిన అనేక కేసులు ఓ పక్క. ఆమె ఏకంగా కోట్లు డిమాండ్ చేస్తోంది. కోర్టులో తన వేదన, నిస్సహాయత తెలియజేస్తున్న చట్టాల్లో ఆ వెసులుబాటు లేదని అతను సుభాష్ గ్రహించినట్లు ఉన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన సుభాష్, తనకు జరిగిన ప్రతి అవమానం, అన్యాయాన్ని కూలంకషంగా వివరిస్తూ 24 పేజీల లేఖ రాశారు. ఇదంతా ఒక ఎతైతే,
(Justice is due)
న్యాయం జరగాలి (Justice is due) శరీరంపై ఓ స్టికర్ అతికించుకున్నాడు. 1.30 గంటల నిడివి తో ఉన్న ఓ వీడియోను అతుల్ సుభాష్ తన వేదనను వివరించాడు. ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియో చూస్తే అతుల్ ఎంత నరక యాతన అనుభవించాడనేది తెలుస్తుంది.. ఈ వీడియోతో పాటు ఓ లేఖ కూడా అన్ని రాష్ట్రాల హైకోర్టులు, బంధువులో తోపాటు సుప్రీంకోర్టు కూడా పంపించారు. అవన్నీ దేశ సర్వోత్తమ న్యాయస్థానానికి అందే సరికి అతుల్ సుభాష్ ఈ లోకంలో లేడు. అదే సమయంలో ఈ తరహా కట్నం వేధింపుల కేసును విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందుకు అతుల్ సుభాష్ పంపిన లేఖ, వీడియో చేరింది.
బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన సుప్రీంకోర్టును కూడా కదిలించింది అనడంలో మాత్రం సందేహం లేదు. సుప్రీం కోర్టు జడ్జీలు స్పందించారు. 498ఏ లో చేయాల్సిన మార్పులపై దృష్టి సారి ఇచ్చినట్లే కనిపిస్తోంది. అంతేకాకుండా, రాష్ట్ర హైకోర్టులకు కూడా వారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టులతో పాటు 498a ఫిర్యాదుల్లో లోతుపాతులను పరిశీలించకుండా రిజిస్టర్ చేయడంపై కూడా పోలీసులకు తలంటినట్లు కనిపిస్తోంది.
"మహిళలు చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయాన్ని గుర్తు చేసింది" తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి విడాకుల కేసు విచారణ చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాకుంటే అన్ని కేసులో ఇలా ఉండవు కొన్ని నిజమైన వేధింపుల కేసులు ఉన్నాయని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. బెంగళూరు టెకి అటుల్ సుభాష్ కేసులో తనకు న్యాయం చేయాలని వస్తున్న డిమాండ్ల క్రమంలో సుప్రీంకోర్టు సెక్షన్ 190 ఏ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.
బార్ అండ్ బెంచ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి విడాకుల కేసులు మంగళవారం విచారణ చేపట్టింది ఐపీసీలోని సెక్షన్ 490ఏ చట్టాన్ని మహిళలు, వారి భర్త బంధువులను వేధించేందుకు చేస్తున్నారని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం 498a చట్టం దుర్వినియోగం పై ఆందోళన వ్యక్తం చేసింది మహిళలు కొంతమంది భర్త అతని కుటుంబాన్ని వేధించేందుకు ఈ సెక్షన్ ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించింది. భర్త అతని కుటుంబంపై వ్యక్తిగత ప్రతీకార్యాన్ని తీర్చుకునేందుకు మహిళలు ఈ నిబంధనను ఓ సాధనంగా వినియోగించుకుంటున్న ధోరణి ట్రైన్ లా మారింది అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

కడపకు చెందిన సీనియర్ అడ్వకేట్ కడప నగరంలోని సీనియర్ న్యాయవాది పఠాన్ అక్గర్ అలీఖాన్ ఏమంటున్నారంటే..

"వరకట్న కేసు వచ్చిందని పోలీసులు పిలగానే భయంతో వెళ్లకూడదు" అని న్యాయవాది పఠాన్ అక్గర్ అలీఖాన్ సూచించారు. సీఐ లేదా ఎస్ఐ చెప్పే వివరాలు ఆలకించండి. ఇందులో వాస్తవాలు ఏమటనేది పోలీస్ అధాకారులను కోరాలి" అని అక్బర్ చెబుతున్నారు. తన భార్య ఇచ్చిన పేర్లలో ఎంతమంది ప్రమేయం ఉందనే విషయాన్ని గట్టిగా అడగగలిగితే, బాధితుడు నిందితుడిగా మారడు. అతని కుటుంబీకులు కూడా వేదనకు గురయ్యే పరిస్థితి ఎదురుకాదు" అని ఆయన అంటున్నారు.

సుభాష్ తండ్రి మాట కూడా "Justice Is Due"

చట్టంలో ప్రాధమిక సూత్రాలను సుప్రీం కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. కాగా, తాజాగా బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటనలో ఆయన తండ్రి పవన్ కుమార్, తల్లి సోదరులు తల్లడిల్లుతున్నారు. "తన కుమారుడు ఆత్మహత్యకు కారణమైన వారికి శిక్ష పడాలి. అంతవరకు కుమారుడి అస్థికలు నిమజ్జనం చేయను" అని పవన్ కుమార్ కన్నీటితో రోధిస్తూ, చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. తన శరీరంపై ఆయన కూడా "Justice Is Due" అని స్టిక్కర్ ఉంచుకున్నారు.
దీనిపై తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది కే. నరసింహారావును 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి పలకరించింది.
"498a మహిళలకు అనుకూలంగా ఉన్న మాట వాస్తవమే. వరకట్న వేధింపులు కావచ్చు. గృహ హింస కేసులు అయినా సరే. ఫిర్యాదు అందుకున్న పోలీస్ అధికారి కాస్త ఆలోచన చేయాలి. ఫిర్యాదులో వాస్తవాలు బయటకు తీసే విధంగా విచారణ జరపాలి"అని అడ్వకేట్ కేఎల్ఎన్. రావు ( కే. నరసింహారావు అభిప్రాయపడ్డారు. Power Of Chair (కుర్చీ శక్తి)కి న్యాయం చేయడానికి దర్యాప్తు అధికారి రంగంలోకి దిగాలి. క్షేత్రస్థాయిలో ఫిర్యాది, నిందితుల ఇంటి వద్దకు వెళ్లి విచారణ జరపాలి. ఈ కారణంగా ఆ కేసు కోర్టు బెంచ్ పైకి కేసు రావడం ఆలస్యం కావచ్చు. దీనివల్ల నిరపరాధులకు వేదన తప్పించడానికి ఆస్కారం ఉంటుంది" అని నరసింహారావు అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, "వరకట్న వేధింపులపై మహిళ ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించిన పేర్లలో ఎవరు? ఎలా బాధ్యులు? నిరపరాదులు ఎవరు? అనే వివరాలతో సమగ్రంగా రిపోర్టు తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కేసు జడ్జి ముందు ఉంచడం ద్వారా నిరపరాధులకు మానసిక వేదన నుంచి కాపాడే వెసులుబాటు ఉంటుంది. చట్టం కూడా దుర్వినియోగం కాకుండా కాపాడవచ్చు." అని ఆయన విశ్లేషించారు. కేసు దర్యాప్తులో నిందలు ఎదుర్కొనే వారు కూడా జాగ్రత్తలు తీసుకుని, వాస్తవాలు నిరూపించడానికి దర్యాప్తు అధికారిని అడగాలని కూడా ఆయన గుర్తు చేశారు.
సుప్రీం మార్గదర్శకాలు
1. భర్త, భార్య కుటుంబాల సామాజిక, అర్థిక స్థితిగతులు
2. విడాకులు కోరుతున్న భార్య, భర్త విద్యార్హత, ఉద్యోగం, ఆదాయ స్థితి
3. భార్య, ఆమెపై ఆధారపడిన పిల్లల అవసరాలు
4. విడాకులు కోరుతున్న భార్యాభర్తల వ్యక్తగత ఆదాయం, ఆస్తుల వివరాలు, స్థితి.
5. అత్తారింటిలో భార్య గడిపిన జీవితకాలం స్థితిగతులు
6. కుటుంబ సంరక్షణ కోసం భార్య ఉద్యోగం వదిలేసింది. ఆమె ఆర్థిక స్థితి
7. ఉద్యోగం చేసే స్థితిలోలేని భార్యకు విడాకుల సమయంలో న్యాయపోరాటానికి అవసరమైన ఆర్థిక స్థితి
8. భర్త ఆర్థిక పరిస్థితి, ఆయన ఆదాయంతో పాటు కుటుంబం సాగించడంలో చేసిన అప్పులు, కుటుంబ నిర్వహణ

అతుల్ సుభాష్ ఆత్మహత్య తరువాత ఆయన మాజీ భార్య, నిఖిత సింఘానియా, అత్త నిశా, బామర్ది అనురాగ్ ను అరెస్టు చేశారు. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది. చట్టంలో ఎలాంటి మార్పులు తెస్తుందనేది వేచి చూడాలి.
Read More
Next Story