33 మంది వృద్ధుల చావుకు ఎవరు కారణం,  హైలెవెల్ విచారణ చేయండి
x

' 33 మంది వృద్ధుల చావుకు ఎవరు కారణం, హైలెవెల్ విచారణ చేయండి'

వృద్ధాప్య పెన్షనర్ల మృతిపై జాతీయ మానవ హక్కుల కమీషన్ కు టిిడిపి, బిజెపి, జనసేనల ఫిర్యాదు



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాక్టర్ కె. ఎస్ జ:వహర్ రెడ్డి అనుచిత చర్య వల్ల ౩౩ మంది వృద్ధ పెన్షనర్లు మృతి చెందారని, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం జాతీయ మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. చాలా మంది వయోవృద్ధులు కదలలేని పరిస్థితిలో ఉన్నా , పెన్షన్ కోసం వారంతా మండెటెండలో గ్రామసచివాలయాలకు రావలసిందేనని చెప్పడంతో ఈ మరణాలు సంభవించాయని ఈ కూటమి నేతలు పేర్కొన్నారు.
ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఈ పార్టీలు పేర్కొన్నాయి.

ఇదే విధంగా పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు సకాలంలో సమకూర్చడంలో విఫలమైన ఇతర ఉన్నతాధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా మానవ హక్కుల సంఘాన్ని నేతలు కోరారు


"పెన్షన్ల పంపిణీలో వలంటీర్లను తప్పించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి ఖాతరు చేయలేదు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయం కారణంగా 33 మంది మరణించారు. కదలలేని స్థితిలో ఉన్న వారిని బలవంతంగా గ్రామ సచివాలయాలకు రావాల్సిందేనని వైసీపీ నేతలు చేసిన ప్రచారం కారణంగానే.. వారంతా మరణించారు," అని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు (వైసిపి) అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జవహర్ రెడ్డిపై ఈ పార్టీలు పిర్యాదులో పేర్కొన్నాయి.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండేందుకు మా కమిషన్‌ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో వృద్ధులైన పెన్షనర్లకు ఇంటి వద్దే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్‌ అందించేలా ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు మానవ హక్కుల సంఘాన్ని కూటమి నేతలు కోరారు.
ఎన్నిలక కోడ్ ను లెక్క చేయకుండా అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కూడా వారు కమిషన్ కుచ విజ్ఞప్తి చేశారు.
.

Read More
Next Story