రాజ్యసభ నుంచి టిడిపి మాయం
x
భారత పార్లమెంట్ భవనం (పాతది)

రాజ్యసభ నుంచి టిడిపి మాయం

రాజకీయాల్లో ఈ మధ్య అనుకోని పరిణామలు ఎదురవుతున్నాయి. అలాంటిదాన్ని ఈ సారి తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతున్నది.


నాలుగు దశాబ్దాలలో తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ కనిపించకుండా పోతున్నది. అంటే ఒక్క ఎంపీ కూడా లేని దుస్థితి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ పార్టీ భారతరాజకీయాల్లోఏ పార్టీ సృష్టించని చరిత్ర సృష్టిస్తూ వచ్చింది. ఇదీ కూడా మరొక చరిత్ర అనుకోవాలి.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన పార్టీ, ఇపుడు ప్రతిపక్ష పార్టీ,దేశరాజకీయాలను శాసించిన పార్టీ, ఒకపుడు కేంద్రంలో దాదాపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఒక పెద్ద పార్టీగా ఉన్న ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ఒక చిత్రమయిన పరిస్థితి ఎదుర్కొంటున్నది ఇపుడు.

అదెందుకు వచ్చిందంటే...

తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఉన్న ఏకైక ఎంపీ కనకమేడల రవీంద్ర. ఆయన పదవీ కాలం ఈ మార్చితో ముగుస్తున్నది. ఆయన రిటైరయితే ఆ సీటు ఖాళీ అవుతుంది.మరొక అభ్యర్థిని రాజ్యసభకు పంపేంత బలగం టిడిపికి ఇపుడు అసెంబ్లీలో లేదు. ఇపుడు రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నా, ఒక్క సీటును గెల్చుకునే శక్తి ఈ పార్టీ కి లేదు.అందువల్ల ఎవరినీ అభ్యర్థిగా పోటీ బెట్ట కూడదని అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నిర్ణయించినట్లు సమాచారం..

పార్టీ ఆవిర్భవించాకా రాజ్యసభకు ఎంపిని పంపలేని పరిస్థితి తొలిసారి ఎదురవుతున్నది.

15 రాష్ట్రాల నుంచి 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ. రాత్రి 9 నుంచి 4 గంటల మధ్య పోలింగ్, కౌంటింగ్ ఓట్లు అదే రోజు జరుగుతాయి. పార్లమెంటు ఎగువ సభలోని 50 మంది సభ్యులు ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనుండగా, మిగిలిన ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3న ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నేత, నెల్లూరు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ పదవీకాలం ఏప్రిల్‌ 3తో ముగియనుంది.

ఈ పరిస్థితి నుంచి తెలుగుదేశం కోలుకునే అవకాశాలున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయితే మళ్లీ టిడిపి రాజ్యసభలో ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతానికి మాత్రం బలమయిన కాంగ్రెస్ చేయలేని పనిని దేశంలోనే కొత్త పార్టీల్లో ఒకటైన జగన్ పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ టిడిపి మీద ఇలాంటి దెబ్బ వేసింది. ఇది చారిత్రాత్మకం.



ఆంధ్ర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నిక మీద మరొక ఆసక్తికరమయిన కథనం ‘ ఆ ముగ్గురు...’ ఇక్కడ చదవవచ్చు.





Read More
Next Story