ఢిల్లీలో పొత్తు కుదిరింది, ఆంధ్రాలో రక్తి కడుతుందా?
x
Source: Twitter

ఢిల్లీలో పొత్తు కుదిరింది, ఆంధ్రాలో రక్తి కడుతుందా?

ఎన్నాళ్లుగానో వూరిస్తూ వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారయిందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల ప్రకటించారు. ఎవరికెన్ని స్థానాలంటే..



ఏపీలో టీడీపీ-జనసేన, బీజేపి పొత్తులపై లెక్కలు తేలాయి. హస్తినకు వెళ్లి టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
పొత్తు ఉంటుందా ఉండదా, ఉంటే ఇంత జాప్యమెందుకు అర్థంకాక టిడిపి వాళ్లు, పరిశీలకులు అయిదారు నెలలుగా తలలు బద్ధలుకొట్టుకుంటూ వచ్చారు. టిడిపికి బిజజెపికి పొత్తుకుదురుతుందా లేదా అనేదాని మీద బాగా బెట్టింగ్ నడిచింది. ఇలాంటి ఉత్కంఠకు ఈ రోజు తెరపడింది. పొత్తుకుదిరిందని అధికారికంగా తెలుగుదేశం పార్టీ ప్రకటిచింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గంటపాటు సాగిన భేటీలో కలిసి పోటీ చేయాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వెల్లడించారు.
2024 లోక్‌‌సభ సహా ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి బీజేపీ, టీడీపీ, జనసేన అంగీకరించాయని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీలు పోటీ చేసే స్థానాలపై జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పొత్తు ఖరారైందని కానీ ఎవరికి ఎన్ని స్థానాలు, అవి ఏవి అనే విషయంపై ఇంకా లెక్కలు తేలలేదని, ఈ అంశంపై చర్చలు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోబడుతుందని స్పష్టం చేశారు.

బీజేపీకి ఎన్ని సీట్లంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి బీజేపీ-టీడీపీ-జనసేన రెడీ అయ్యాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే వీరి పొత్తు లక్ష్యం. ఈ పొత్తును ఈరోజు ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేనకు కలిసి 30 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని టీడీపీ నిర్ణయించుకుందని, దానికి తోడుగా 6 ఎంపీ స్థానాలు బీజేపీకి, జనసేనకు 2 ఎంపీ స్థానాలు ఇవ్వనుట్లు పేర్కొందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్థానాల విషయంలో ఢిల్లీ నుంచి బీజేపీ నేత ఒకరు వచ్చి పురందేశ్వరితో చర్చిస్తారని, ఆ తర్వాత అసెంబ్లీ స్థానాల విషయంలో క్లారిటీ వస్తుందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.

ఢిల్లీలో కుదిరిన పొత్తుతో ఆంధ్రా రాజకీయాలు రక్తికడతాయా? వేచి చూడాలి. ఎందుకంటే, 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలసి సునాయాసంగా ఓడించింది రాష్ట్ర విభజన పూనుకుని బాగా అపకీర్తి పాలయిన కాంగ్రెస్ పార్టీని. అపుడు ఆంధ్రా ప్రజలంతా కాంగ్రెస్ మీద అక్కసుతో ఉన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఇంకా బాల్య దశలోనే ఉంది. అందువల్ల సిఇఓ గా పేరున్న చంద్రబాబు నాయుడు వస్తే విభజనతో వేదనతో ఉన్న రాష్ట్రానికి భరోసా ఇస్తాడని భావించారు ఓటేశారు. ఇపుడు 2024లో కాంగ్రెస్ లేదు. అయితే, బలమయిన అధికార పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఉంది. తనకు ఎవ్వరితో పొత్తు అవసరం లేదన్న ధీమా ఉన్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందువల్ల ఈ పొత్తు పని చేస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న.
ఒక పని చేస్తే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పనిచేస్తుందా, జగన్ కు అనుకూలంగా మారి బెడిసికొడుతుందా? ఈ కూటమి సంయుక్త ప్రచారం మొదలుపెడితే పొత్తు గాలి ఎటువీస్తున్నదో తెలుస్తుంది.


Read More
Next Story