టీచర్ల బదిలీల కోసం బొత్స సత్యనారాయణ లంచాలు తీసుకున్నారా..?
x

టీచర్ల బదిలీల కోసం బొత్స సత్యనారాయణ లంచాలు తీసుకున్నారా..?

వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత వర్ల రామయ్య.. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు.


వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత వర్ల రామయ్య.. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. టీచర్ల బదిలీల విషయంలో బొత్స అక్రమాలకు పాల్పడ్డారని రామయ్య ఆరోపించారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ఏసీబీని కోరారు. టీచర్ బదిలీ కోసం బొత్స రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఈ బదిలీ దందాతో బొత్స దాదాపు రూ.65 కోట్లు వసూలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కొందరు టీచర్ల బదిలీలు జరిగాయని, వాటి వెనక బొత్స హస్తం ఉందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స ఉన్న కాలంలో జరిగినంద మోసం ఎన్నడూ జరగలేదని అన్నారు. ఇప్పటికిప్పుడు బొత్స పేషీలో వారిపై దాడులు చేయడానికి 2500 మంది టీచర్ల వరకు సిద్ధంగా ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు. వీటన్నింటినీ పేర్కొంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు. ఏసీబీ డీజీ అందుబాటులో లేకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదును అందించామని, ఒక్కసారి దర్యాప్తు ప్రారంభమైతే అంతా కట్టకట్టుకుని శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడం ఖాయమని చురకలంటించారు.

అంతా బయటకొస్తుంది

బొత్స సత్యనారాయణ పాల్పడిన అవినీతి బాగోతం అంతా కొన్ని రోజుల్లోనే బయటకు వస్తుందని, అందులో డౌట్ లేదని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఉన్న ఐదేళ్లలో అవినీతే శ్వాసగా బతికి ప్రతి ఒక్కరి జీవితాలను ప్రజల ముందు ఉంచతామని, వారందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే పలువురిపై ఆధారాలతో కూడా ఫిర్యాదులు చేశామని, వాటిపై ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దర్యాప్తు షురూ అవుతుందని వెల్లడించారు.

‘కోట్లు దండుకున్నారు’

ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ‘‘గత నెల 13న జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ఛీ కొట్టి టీడీపీ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించారు. పిల్లపోయినా పురుటివాసన పోనట్లు వైసీపీ నేతల అవినీతి పోవడంలేదు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన, ఆయన పేసీలోని అధికారులు, కమిషన్ కార్యాలయ ఉద్యోగులు టీచర్ల బదిలీ పేరుతో ఒక్కోక్క టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు వసూళ్లకు పాల్పడి దాదాపు రూ.60 కోట్లు దండుకున్నారు. బిడ్డలకు చదువు చెప్పి భావి భారత పౌరులుగా తీర్చి దిద్ది, నీతి, అవినీతికి తేడాలు తెలియజేసి సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను మోసం చేయడం సిగ్గుచేటు.

జగన్ రెడ్డి స్కాం లతో పోలిస్తే ఇది పెద్దది కాకపోవచ్చు కానీ.. విద్యాశాఖలో ఇంత దోపిడీ ఎప్పుడూ జరగలేదు. టీచర్లు లబోదిబోమంటున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎవరైనా ట్రాన్ఫర్ చేస్తారా...? ఎలక్షన్ అయ్యాక కొత్త స్థానాల్లో చేరాలని చెప్పారు. ఎలక్షన్‌లు అయ్యాక కొత్త గవర్నమెంట్ వచ్చింది. టీచర్ల బదిలీల్లో అవినీతి జరిగినట్లు గుర్తించారు. టీచర్ల బదిలీలు నిలిచిపోయాయి. ఇప్పుడు టీచర్లు లబోదిబో అంటున్నారు. ఇప్పుడు టీడీచర్లు అందరూ వారి నుండి దోచుకున్న మంత్రి, మంత్రిపీఏ, కమిషనరేట్ లో కిలకమైన అధికారి ఇళ్లపై దాదాపు 1600 మంది టీచర్లు దాడి చేసే పరిస్థితి వచ్చింది.

ఈ ప్రమాదం నుండి రక్షించడానికి ఏసీపీ కార్యాలయానికి వచ్చాం. కాని డీజీపీ లేరు. ఆయన ఉంటే ఏదోకటి తేల్చేవారు. మంత్రి సంగతి చూసేవారు. ఎస్పీ రవి ప్రకాశ్ మా ఫిర్యాదు తీసుకున్నారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరికి ట్రాన్ఫర్ లు వచ్చాయో ఆ టీచర్లు ఒక్కొక్కరిని విచారిస్తే వాళ్లే మాజీ మంత్రి బొత్స బాగోతం, బొత్స పీఏ, కమిషనరేట్ లో ఆ కీలక అధికారి బాగోతం వారే భయటపెడతారు. ఈ ఇన్వెస్టిగేషన్‌కు పెద్ద అధికారులు కూడా అవసరంలేదు ఒక ఎస్సై సరిపోతాడు. వారం రోజుల్లో బొత్స సంగతి తేలిపోతుంది. టూరిజం శాఖలో అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తాం. మంత్రులుగా ఉండి అవినీతికి పాల్పడిన వారందరూ శ్రీకృష్ణ జన్మస్థానం కు వెళతారు. అవినీతి చేసిన ఏమంత్రిని వదిలేది. మహిళామంత్రైనా సరే జైలుకు పోవాల్సిందే. అన్ని బయటకు వస్తాయి.. ఈ అవినీతి తెలిసే రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతలను తరిమి తరమి కొట్టారు. చట్టపరిధిలో దర్యాప్తు జరుగుతుంది. ఏపీసీ, సీఐడీలు వైసీపీలో లాగా పనిచేయవు. వైసీపీ నేతలు శ్రీకృష్ణ జన్మస్థానంకు పోవడం ఖాయం’’ అని అన్నారు.




ఆ జిల్లాల్లోనే అధికం

బొత్స హయాంలో అత్యధిక బదిలీలు మచిలీపట్నం, విజయవాడలోనే జరిగాయి. బొత్స పేషీలు తమ సిఫార్సు లేఖలను అవనిగడ్డ, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఇచ్చారు. విజయవాడ, మచిలీపట్నంలో పోస్టింగ్ తెచ్చుకుంటే హెచ్‌ఆర్‌ఏ అధికంగా వస్తుంది. బదిలీ కోసం ఖర్చు చేసినదాన్ని నాలుగేళ్లలో హెచ్‌ఆర్ఏ రూపంలో తిరిగి అందుకోవచ్చు. అంతేకాకుండా పిల్లల చదువులతో పాటు అనారోగ్యం వస్తే ఆసుపత్రులు దగ్గరగా ఉండాలని, ఇతరత్రా అవసరాల కోసం కూడా పట్టణాల్లోనే ఉండాలన్న ఆలోచనతోనే డబ్బు ముట్టజెప్పి బదిలీలు చేయించుకుంటున్నారని ఓ ఉద్యోగి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లోని డీఎస్‌సీ కోచింగ్ సెంటర్లలో సెకండ్ జాబ్ చేయొచ్చన్న ఉద్దేశంతో కూడా కొందరు ఇలా చేశారని అనే వారు లేకపోలేదు.

అసలు హెచ్ఆర్‌ఏ అంటే ఏంటి?

హెచ్ఆర్ఏ అంటే ఏమీ లేదు.. హౌస్ రెంట్ అలవెన్స్ అంతే. మనం ఉండే ఇంటి అద్దెకోసం సంస్థలు అందించే అలవెన్స్ అన్నమాట. ఇది ఉద్యోగి వేతనంలో కలిసి ఉంటుంది. శాలరీ స్ట్రక్చర్‌లో ఇది చాలా కీలకం. అద్దె ఇంట్లో ఉండే ఉద్యోగులు పన్నుల భారం తగ్గించుకోవడనానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే విజయవాడ, మచిలీపట్నం వంటి పట్టణాల్లో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంలో ప్రభుత్వం టీచర్లకు ఎక్కువ హెచ్‌ఆర్‌ఏను అందిస్తుంది. అది తమకు కలిసి వస్తుందన్న ఉద్దేశంతోనే చాలా మంది ఇక్కడకు బదిలీ అవుతున్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story