టీడీపీ మూడో జాబితా వచ్చేసింది..
x
Source: Twitter

టీడీపీ మూడో జాబితా వచ్చేసింది..

అసెంబ్లీ, లోక్‌సభ సభ్యులతో టీడీపీ మూడో జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.


టీడీపీ మూడో జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా విడుదల చేశారు. ఈ మూడో జాబితాలో 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా వీరిని తదుపరి జాబితాలో విడుదల చేస్తారని కొందరు అంటుంటే మరికొోందరు మాత్రం కూటమిలో భాగంగా ఇతర పార్టీలతో పంచుకోవడానికే ఈ కొన్ని స్థానాలను పెండింగ్ పెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపి తలపోటుగా మారడంతో వాటిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలన్న యోచనతోనే చంద్రబాబు వాటిని పక్కన పెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వీటిపై త్వరలో ఏమైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.

11 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు

మైలవరం - వసంత కృష్ణప్రసాద్

ఎస్ కోట - కోళ్ల లలిత కుమారి

పలాస - గౌతు శిరీష

శ్రీకాకుళం - గొండు శంకర్

అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు

పెనమలూరు - బోడే ప్రసాద్

నరసరావుపేట - చదలవాడ అరవింద్ బాబు

పాతపట్నం - మామిడి గోవిందరావు

చీరాల - మద్దులూరి మాలకొండయ్య

13 మంది ఎంపీ అభ్యర్థు..
నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు
శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
విశాఖపట్నం - భరత్
గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాదరావు
నంద్యాల - బైరెడ్డి శబరి
కర్నూలు - బస్తిపాటి నాగరాజు
హిందూపురం - పార్థసారథి
అమలాపురం - గంటి హరీష్ మాధుర్
ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ - కేశినేని చిన్ని
బాపట్ల - టి కృష్ణప్రసాద్
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

(ఇంకా ఐదు అసెంబ్లీ నాలుగు పార్లమెంటు సీట్లకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.)

Read More
Next Story