ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు.. ఇది సరిపోదంటున్న నెటిజన్స్
x

ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు.. ఇది సరిపోదంటున్న నెటిజన్స్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు టీడీపీ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.


లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు టీడీపీ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస‌రావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా పూర్తికాకుండా ఒక ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు రావడం, లైంగిక దాడులకు సంబంధించి వీడియోలు బయటకు రావడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇటువంటి నేతపై జీవిత కాల అనర్హత వేటు వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కోనేటి ఆదిమూలం వ్యవహారం రాష్ట్రమంతటా హాట్ టాపిక్‌గా మారింది.

ఆదిమూలం సస్పెండ్

ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. మహిళలకు న్యాయం చేయాలని, ఇటువంటి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు వివిధ మాధ్యమాలలో కోనేటి ఆదిమూలం (సత్యవేడు నియోజకవర్గ ఎమ్యెల్యే) ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది’ అని అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేశారు.




సస్పెన్షన్ శిక్ష కాదు..!

ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసిన సందర్భంగా ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏ విధంగా శిక్ష అవుతుందని టీడీపీని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను వదిలి పెట్టకూడదని, ఈ వ్యవహారం తేలే వరకు ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన చేసిన నేరం రుజువు అయితే అలాంటి వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంతో పాటు.. వారిపై యావజ్జీవ అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఫాస్ట్‌ట్రాక్ దర్యాప్తు చేపట్టాలని, ఇవన్నీ తప్పుడు ఆరోపణలే అయినా కేసు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. కానీ ఒక మహిళ విషయంలో మాత్రం జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కోరిక తీర్చాలంటూ టార్చర్

‘‘మేము కూడా టీడీపీకి చెందిన వాళ్లమే. దీంతో పలు పార్టీ కార్యక్రమాల్లో ఆదిమూలం, మేము కలిశాం. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. పదేపదే కాల్ చేయడం ప్రారంభించాడు. తిరుపతిలోని బీమాస్ హోటల్ రూమ్ నెం.109లోకి రమ్మని ఒకసారి కాల్ చేసి చెప్పాడు. అక్కడకు వెళ్లిన తర్వాత బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. చెల్లి అంటూనే నాపై మూడు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో నేను కొన్ని వీడియోలు కూడా తీశాను. వాటినే విడుదల చేశాను’’ అని బాధితురాలు పేర్కొన్నారు.

Read More
Next Story