ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుడు ఇజాజ్ అహమ్మద్ హత్య ఘటన ఉపాధ్యాయ వర్గాలను కుదిపేసింది.
ఉపాధ్యాయుడు ఇజాజ్ అహమ్మద్ హత్య ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. ఊహించని ఈ సంఘటన రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలను కలవరానికి గురిచేసింది. ఒక్క సారిగా షాక్‌కు గిరి చేసింది. రోడ్లపైకి వచ్చేలా రగిల్చింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ బగ్గు మంటున్నాయి. ఉపాధ్యాయులందరూ రోడ్లపైకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. గత రెండు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. నల్ల బ్యాడ్జీలను ధరించి నిరనలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు ఇజాజ్ అహమ్మద్ మృతిపై నిగ్గు తేల్చాలని గళం విప్పుతున్నారు. ఇప్పటికే రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఇజాజ్ అహమ్మద్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలో మృతిచెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అహ్మద్‌కు రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో 9వతరగతి విద్యార్థులు ఉపాధ్యాయులపై దాడి చేశారని ఆయన బంధువులు, మృతుని భార్య ఆరోపిస్తున్నారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ మరిచినప్పుడు ప్రధానోపాధ్యాయుడు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ జరపకపోవడం విచారకరమన్నారు. ఈ సంఘటనలో బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో అపుస్మా నాయకులు వీఆర్‌రెడ్డి, రమణారెడ్డి, నాగసుబ్బారెడ్డి, నాగేశ్వర్‌రావు, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.