అమెరికాలో తెలుగు వైద్యుడు మృతి..
అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యుడు మృతి చెందారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన పేరంశెట్టి రమేశ్‌బాబు మరణించారు.
అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యుడు మృతి చెందారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన పేరంశెట్టి రమేశ్‌బాబు మరణించారు. కరోనా సమయంలో విశేష సేవలు అందించిన అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అలబామా రాష్ట్రంలోని టస్కలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా ఇప్పుడు ఆయన మరణానికి కారణమైన దుండగుడి కాల్పుల ఘటనపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. దుండగుడి కోసం తీవ్రంగా గాలింపులు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే అమెరికాలో ఎన్నో ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘటనత కూడా రమేష్‌కు చెందుతుంది. ఆయన సేవలకు గుర్తింపుగా అక్కడి ఒక వీధికి ఆయన పేరు కూడా పెట్టారు అధికారులు. భారత్ నుంచి అమెరికాకు వచ్చే ఎందరో ప్రముఖులకు కూడా ఆయన ఆతిథ్యమిచ్చేవారు.
రమేష్ బాబు నేపథ్యం..
రమేశ్‌బాబు.. తిరుపతి ఎస్వీ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఉన్నతవిద్య కోసం జమైకా వెళ్లి అక్కడ ఎమ్మెస్ పూర్తి చేశారు. అనంతరం ఆయన అమెరికాలోనే స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం మొత్తం అమెరికాలోనే స్థిరపడింది. కరోనా సమయంలో రమేశ్ విశేష సేవలందించి పలు పురస్కారాలు కూడా అందుకున్నారు.
రమేష్‌బాబు.. తాను చదువుకున్న ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం రూ.14 లక్షలు విరాళం అందించారు. స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణం కోసం రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ నెల 15న కూడా నాయుడుపేటలోని బంధువుల వివాహ వేడుకలో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న రమేశ్.. ఇంతలో మరణించిన వార్తతో వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో నివాసం ఉంటున్న రమేశ్.. తల్లి, తమ్ముడు, నాయుడుపేటలో ఉంటున్న సోదరి అమెరికాకు వెళ్లడానికి సన్నద్ధమవుతున్నారు.