రైల్వే శాఖ విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలిచింది.


ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి అడుగు ముందుకు పడింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ముందుగా విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయం నిర్మాణ ం చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియపై కేంద్ర రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆ మేరకు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. కాంట్రాక్టు సంస్థల నుంచి టెండర్లకు ఆహ్వానాలను కోరింది. డిసెంబరు 27లోపల టెండర్లు దాఖలు చేయాలని రైల్వే శాఖ పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న సంస్థ రెండేళ్లల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలకు సూచించింది. భారీగానే విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయా నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 11 అంతస్తుల మేరకు భవన నిర్మాణం చేపట్టనున్నారు. రెండు సెల్లార్లు, 9 అంతస్తుల్లో భవన నిర్మాణం చేయనున్నారు. రూ. 149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం 53 ఎకరాల భూమిని ఇది వరకే రైల్వే శాఖకు అప్పగించారు.


Next Story