గేటెడ్ కమ్యూనిటీలో దొంగల భీభత్సం
x

గేటెడ్ కమ్యూనిటీలో దొంగల భీభత్సం

పెద్ద అంబర్ పేటలో సెంట్రల్ లాక్ డోర్లు బద్దలు కొట్టి లూటీ


హైదరాబాద్ పెద్ద అంబర్ పేటలో అండర్ పేట గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న రెండిళ్లలో దొంగలు భీభత్సం సృష్టించారు. సెంట్రల్ లాక్ ఉన్న డోర్లు బద్దలు కొట్టి దొంగలు ఇంట్లో ప్రవేశించారు. 5 కెజీల వెండి, 35 గ్రాముల బంగారం, 60 వేల నగదు, విలువైన చీరలను దొంగలు అపహరించారు. ముఖానికి మాస్క్ లు ధరించి గేటెడ్ కమ్యూనిటీలో ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

కట్టుదిట్టమైన భద్రత గేటెడ్​ కమ్యూనిటీల్లో ఉంటుంది అని అందరూ అనుకుంటారు. పెద్ద అంబర్ పేటలో దొంగల భీభత్సం చూస్తే ఏ మాత్రం సేప్టీ కాదని రుజువయ్యింది. లోనికి ఎవరైనా ప్రవేశించాలంటే తప్పకుండా యజమాని అనుమతి ఉండాలి. అలాంటి చోట దొంగలు ప్రవేశించి అందిన కాడికి దోచుకోవడం పోలీసులకు పెద్ద సవాల్ గా నిలిచింది. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story