కడపలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్‌ మీటింగ్‌లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.


ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం హోదాలో తొలి సారి పవన్‌ కల్యాణ్‌ కడప జిల్లా పర్యటన చేశారు. శనివారం కడప మునిసిపల్‌ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరంట్స్‌ మీటింగ్‌ జరుగుతుంది.. మీరు పాల్గొనాలని నన్ను అడినప్పుడు ఏ ఊరు వెళ్లాలని ఆలోచనలు చేశానని, సజహంగా నన్ను పిఠాపురానికి పరిమితం చేస్తారని, కానీ కడప వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎందుకు అంటే.. రాయలసీమ గ్రంథాలయాలతో విలసిల్లిన ప్రాంతం. చదువుల నేల రాయలసీమ. ఇక్కడ నుంచి ఎంతో మంది మహాను భావులు వచ్చారు. అలాంటి నేపథ్యం ఉన్న ప్రాంతానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. తన భావాలను పంచుకోవడానికి ఇక్కడకు వచ్చాను. మొల్ల, అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణా చార్యులు, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల్లి నాగిరెడ్డి, బళ్లారి రాఘవ, కేవీ రెడ్డి, ఉయ్యాలవా నరసింహారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి ఎంతో మంది మహాను భావులు వచ్చిన ప్రాంతం ఇది.

ఇలాంటి నేల రాయలసీమకు పూర్వపు వైభం రావాలని అని పవన్‌ అన్నారు. కడప జిల్లా నుంచి ఇద్దరు సీఎం వచ్చారని, ఇక్కడ తాగు నీటి సమస్య ఉండదనుకున్నానని.. కానీ నేటికీ తాగు నీటి సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమని అన్నారు. వీటిని పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పిల్లలతో చర్చిస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నా. ఇటీవల విద్యార్థులు టీచర్‌పై దాడి చేసిన ఘటన చూశాం. విద్యార్థులు ఎజాజ్ అహమ్మద్ అనే టీచర్ పై దాడి చేసి కొట్టి చంపడాన్ని రాయచోటిలో చూశామన్నారు. అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో టీచర్లకు కూడా అంతే బాధ్యత ఉందని అన్నారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. అంతకు ముందు విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

Next Story