TTD unions protest | టీటీడీలో రగులుతున్న ఉద్యోగులు... ఆందోళన బాట
x

TTD unions protest | టీటీడీలో రగులుతున్న ఉద్యోగులు... ఆందోళన బాట

సుదీర్ఘ విరామం తరువాత ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. పరిపాలనా భవనం వద్ద ఆందోళనకు పిలుపు ఇచ్చాయి. బోర్డు సభ్యుడి నోటి దురుసుతనం దీనికి కారణమైంది.


టీటీడీలో మరో వివాదం రాజుకుంది. శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. దీనిపై కూడా విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగానే..

అధికారులు, పాలక మండలి మధ్య కొరవడిన సమన్వయం మరోసారి తెరమీదకు వచ్చింది. కర్ణాటక నుంచి టీటీడీ బోర్డులో సభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నసురేష్ కుమార్ ఉద్యోగిని ఆలయ మహద్వారా వద్దే అసభ్యంగా దూషించారు. దీనిపై అధికారులు, బోర్డు పెద్దలు నోరు మెదపడం లేదు. దీంతో కొన్నేళ్లుగా స్తబ్ధతగా ఉన్న టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపుఇచ్చాయి.
కారణం ఇదే...

శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఉద్యోగి బాలాజీని బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దూషించిన సంఘటన తెలిసిందే. ఇది రాజకీయంగా రగులుకుంటోంది. టీటీడీ ఉద్యోగి బాలాజీకి మద్దతుగా ఇంత కాలానికి టిటిడి ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో ఆందోళనకు దిగుతున్నాయి. గతంలో జరిగిన సంఘటనలపై నోరు మెదపని టిటిడి ఉద్యోగ సంఘాల నాయకులు టిటిడి పరిపాలన భవనం వద్ద గురువారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.
దీనిపై సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఏమంటున్నారంటే..
"తిరుమలలో టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడి దౌర్జన్యానికి పూనుకున్న బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ను బోర్డు నుండి తొలగించాలి" అని డిమాండ్ చేశారు. నరేష్ కుమార్ను బోర్డు సభ్యత్వం నుంచి తొలగించి, అతనిపై కేసు నమోదు చేయాలని సిపిఎం నాగరాజు అన్నారు.
ఇన్నాళ్లు మౌనంగా...
టీటీడీ ప్రధానంగా తిరుమలలో గతంలో అనేక వ్యవహారాలు జరిగినా సంఘాలు స్పందించిన దాఖలాలు లేవు. గత 20 ఏళ్లుగా టీటీడీ ఉద్యోగ సంఘానికి ఎన్నికలు కూడా నిర్వహించడం లేదు. ఆ సంఘం యాక్టివ్ గా ఉన్న సమయంలో ఉద్యోగుల హక్కులపై ఉద్యమించడంలో నేతలు రాజీ పడలేదనేది అందరికీ తెలిసిందే. ఎన్నికలు నిర్వహించడానికి టీటీడీ యంత్రాంగం ఆస్కారం ఇవ్వని స్థితిలో సంఘాల స్వరం వినిపించడానికి మినహా, ఆందోళనలకు దిగిన దాఖలాలు లేవు.
రాజకీయలకు ఊపిరి
తాజాగా టీటీడీ ఉద్యోగిని పాలక మండలి సభ్యుడు దూషించిన ఘటన నేపథ్యంలో సంఘాలన్నీ ఆందోళనకు సమాయత్తం అయ్యాయి. వాస్తవానికి ఆ సంఘటన ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుంది. దీనిని కాపాడడంలో బోర్డు సభ్యులు కూడా హూందాగా వ్యవహరించాలి. కర్ణాటక సభ్యుడు సురేశ్ కుమార్ వద్ద అదే లోపించిందనడంలో సందేహం లేదు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఇలా స్పందించారు..
"బాధ్యతాయుతంగా ఉండాల్సిన బోర్డు సభ్యుడు సురేశ్ కుమార్ గాడి తప్పారు. ఉద్యోగిని అవమానించడం సరికాదు" అని ఆక్షేపించారు. ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. "గౌరవంగా మెలగాల్సిన చోట అమర్యాదగా ప్రవర్తించిన సురేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే, ప్రభుత్వ పెద్దలే తప్పించాలి" అని కూడా ఆయన ప్రభుత్వానికి సూచించారు.ఇదిలావుంటే..
టీటీడీలో ఈ సంఘటన రాజకీయ ప్రమేయానికి దారితీసేలా మారింది. ఎందుకంటే, టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై కొందరు అసంతృప్తితో ఉన్నారని, గత పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై టీటీడీ సంఘాలు నోరు విప్పలేని పరిస్థితి. ఇప్పుడు బోర్డు సభ్యుడు ఉద్యోగిని దూషించిన సంఘటనపై నిర్వహించే ఆందోళనలతో ప్రతిపక్షాలకు కూడా అస్ర్తం దొరికినట్లు కనిపిస్తోంది. ఇదే అదనుగా ఇంకొన్ని పార్టీలు, సంస్థలు రంగప్రవేశం చేస్తే, టీటీడీలో మళ్లీ రాజకీయ రచ్చకు ఆస్కారం ఏర్పడే వాతావరణం కనిపిస్తోంది.
టీటీడీ SWUF CITU గౌరవ అధ్యక్షుడు, కన్వీనర్ టీటీడీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుుడు గోల్కొండ వెంకటేశం మాట్లాడుతూ, ఉద్యోగుల స్థైర్యం కాపాడాలని కోారరు. బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అక్కడ జరిగింది ఇదీ...
తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ స్వామివారి దర్శనం తరువాత వెలుపలికి వచ్చారు. మహాద్వారం వద్ద ఉన్న మెయిన్ గేట్ తీయమని బోర్డు మెంబర్ వెంట ఉన్న అటెండర్ అక్కడ డ్యూటీలో ఉన్న టిటిడి ఉద్యోగి బాలాజీని అడిగారు. కుదరదని చెప్పిన బాలీజీ పక్కన ఉన్న బయోమెట్రిక్ ద్వారం నుంచి వెళ్లాలని సూచించారు. నరేష్ కుమార్ తాను బోర్డు నెంబర్ అని చెబుతున్నా గేటు తీయని ఉద్యోగి బాలాజీ పై బూతుపురాణం అందుకున్నారు. ఈ వ్యవహారంపై రగడ ప్రారంభం కావడం తెలిసిందే. విచక్షణ కల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ విచక్షణ "థర్డ్ క్లాస్ నా కొడకా ఫస్ట్ బయటకు వెళ్ళరా..." అంటూ బూతులు మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై టీటీడీ ఇఓ జోక్యం చేసుకొవాలని సీపీఎం నేత కందారపు మురళీ కోరారు. బోర్డు సభ్యుడి పై కఠిన చర్యలు తీసుకోవాలి" అని మురళీ కోరారు.
వాస్తవానికి మహద్వారం గేటు నుంచి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు వెలుపలికి వెళ్లడానికి పెద్ద అభ్యంతరాలు ఏమి ఉండాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్లాలంటేనే ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. ఎక్కువ రద్దీ సమయంలో సాధారణ భక్తులను కూడా వెలుపలికి పంపించేందుకు బయోమెట్రిక్ ద్వారా కాకుండా మెయిన్ గేటు నుంచి ఎక్కువగా పంపిస్తారు. పది రోజుల కిందట కొత్తగా మహాద్వారం వద్ద నుంచి ఇకపై ఎవరిని వెలుపలికి అనుమతించాల్సిన అవసరం లేదంటూ ఈఓ ఆదేశాలు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.
బోర్డు సభ్యుడి తీరుపై అన్ని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆదర్శం, భక్తులకు సేవలు అందిస్తామని ప్రమాణం చేసిన ఆలయం వద్దే బూతులు తిట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
దీనిపై టిటిడి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు టీ. సుబ్రమణ్యం ఏమంటున్నారంటే..
"టిటిడి ఉద్యోగులంటే లెక్కలేనితంగా వ్యవహరిస్తున్నారు. అహంకారంగా మాట్లాడిన బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి" అ సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.
Read More
Next Story