ముంబాయి సినీ నటి కేసులో ఆంధ్రప్రదేశ్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ఐపీఎస్ అధికారిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసు పోలీసు వర్గాల్లో వణుకు పట్టిస్తోంది. ఇంకా ఎంత మంది పోలీసు అధికారులను అరెస్టు చేస్తారో అని భయాందోళనలకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముంబాయి సినీ నటి జెత్వానీ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్టు తప్పదా అనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటీషన్‌పై నేడు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీ సీతారామాంజనేయులును ఎందుకు ఇంత వరకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయకపోవడానికి గల కారణాలేంటని ప్రభుత్వం తరపున న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. పీ సీతారామాంజనేయులు ఇంకా ముందస్తు బెయిల్ పిటీషన్ వేయలేదు కదా? మరి ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, ఏసీపీ, సీఐలు ముందుస్తు బెయిల్‌ను కోరుతూ హైకోర్టులో ఇదివరకు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై చేపట్టిన విచారణలో.. పిటీషనర్లపై విచారణ ముగిసేంత వరకు ఈ కేసులో అరెస్టు నుంచి హైకోర్టు వారికి రక్షణ కల్పించింది. అయితే ఏ2గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీ సీతారామాంజనేయులు మాత్రం ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పటిటీషన్ కూడా దాఖలు చేయలేదు.