ముగ్గరు ముసుగు దొంగలు. వారిలో ఒకరు యువతి. అందరూ కలిసి వారం రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథనిలో ఒక ఇంట్లోకి దూరి కుక్కను దొంగిలించారు. ఎలా దొంగిలించారంటే...
కుక్క ప్రేమ వర్ణించలేనిది అంటారు పెద్దలు. నిజమే ఒక కుటుంబాన్ని ఆ కుక్క ఎంతగా ప్రేమించిందో ఆ కక్క కనిపించకపోయే సరికి రెండు రోజులు ఇంటిల్లిపాది అన్నం మానేశారు. కుక్కలు కూడా మనం చూస్తుంటాం. యజమాని కనిపించకపోతే అన్నం తినదు. అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న అటువంటి కుక్కను దొంగిలించారు కొందరు దొంగలు. వారిని దొంగలు అనటం కంటే వారు కూడా కుక్క ప్రేమికులై ఉంటారు. లేకుంటే వారు దొంగిలిస్తుంటే ఆ కుక్క మాత్రం కిమ్మనకుండా ఎందుకుంటుంది. వారు తీసుకుపోతున్న రోడ్డుపై పెట్టిన సీసీ కెమెరాలు వారిని పట్టించాయి. కెమెరాల్లో గుర్తించిన పోలీసులు వారి ఫొటోలు చుట్టుపక్కల వారికి పంపించి ప్రచారం చేశారు. దీంతో వారంతకు వారు లొంగిపోయి బయటకు రాకుండా ఆ ఊళ్లో పదిమందిని పంపించి కుక్క సొంత ఇంటికి పంపించారు. ఈ సంఘటన ఎలా జరిగిందంటే...
మంథనిలోని శ్రీరాంనగర్ లో నివాసం ఉంటున్న నారాయణ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వారు అక్కడ చోరీ చేసింది నారాయణ ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న హచ్ రకం కుక్కను. యువతి తీసుకొచ్చిన చున్నీలో శునకాన్ని చుట్టి చంకలో పెట్టుకుంది. వచ్చిన దారినే ముగ్గురూ కలిసి బైక్ పై పరారయ్యారు. వీరు కుక్కను తీసుకుపోతున్న దృశ్యాలు రామగిరి మండలం లద్నాపూర్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇంటి గేటు కాస్త తెరిచి ఉంచడం దొంగలకు వెళ్లి వచ్చేందుకు ఈజీ అయింది. కొద్ది సేపటికి మా కుక్క ఇంట్లో నుంచి మాయమైందని లబోదిబో మన్నారు. వీధంతా వెతికారు. అందరినీ అడిగారు. ఎక్కడా కనిపించలేదు.
రెండు రోజులు అన్ని వీధులు వెతికి ఎంత మందిని అడిగినా జాడ తెలియలేదు. రెండు రోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సమయంలోనూ కుక్కను పెంచుకున్న మమకారం ఎలా ఉంటుందనేది తమ కన్నీళ్ల ద్వార పోలీసులకు చెప్పారు. సాయంత్రం వేళ అందరం ఇంట్లో ఉన్నాము. కుక్క మాయమైంది. ఏమైందో ఏమో అనుకుంటూ పోలీసులకు చెప్పారు. పోలీసులు అడిగిన విధంగా కుక్క ఫొటోలు అందించారు. ఇక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుక్కను దొంగలు దొంగిలించారనే విషయం పోలీసు స్టేషన్ కు చేరిందని, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారని స్థానిక పత్రికల్లో వచ్చింది. కుక్కను దొంగిలించిన వారు ఏమనుకున్నారో ఏమో వారం రోజుల తరువాత 10 మందికి కుక్కను ఇచ్చి తాము దొంగిలించి తెచ్చామని, మేము తీసుకెళ్లి ఇద్దామంటే కొడతారేమోనని భయంగా ఉందని చెప్పారు. దీంతో ఆ పది మంది కుక్కను తీసుకొని ఇంటి యజమాని అప్పారి నారాయణ ఇంటికి వచ్చారు. కుక్కను చూడగానే ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఒక్క సారిగా కళ్లు విప్పారుకున్నాయి. ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాయనా మీరు ఎవరో కాని మా కుక్కను తెచ్చి ఇచ్చి మా బాధను తీర్చారు అంటూ వారికి దండం పెట్టారు. కుక్కను దొంగిలించిన వారు రామగిరి మండలం ముల్కలపల్లికి చెందిన వారని కుక్కను తెచ్చిన వారు చెప్పారు. దీంతో కథ సఖాంతమైంది.