కాంగ్రెస్‌ ఉద్యమంలో తొలి అడుగు

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాహుల్‌గాంధీకి మద్దతుగా విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన దీక్షలో పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ ఉద్యమంలో తొలి అడుగు
x
కాంగ్రెస్‌ ధర్నాలో వైఎస్‌ షర్మిల

నిరసన దీక్షలో షర్మిల

కాంగ్రెస్‌ ఉద్యమంలో వైఎస్‌ షర్మిలరెడ్డి తొలి అడుగు వేశారు. తెలంగాణలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ స్థాపించి ఉద్యమాలు చేసిన షర్మిల కాంగ్రెస్‌లో చేరి మొదటిసారిగా విశాఖపట్నంలో సోమవారం రాత్రి నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. అస్సాంలో భారత్‌ జోడో న్యాయ యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుని దాడికి యత్నించి, శంకర్‌దేవ్‌ సత్రాలయం దర్శన ం కూడా చేసుకోకుండా ఆపివేశారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఉవ్వెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంలలో కార్యక్రమాలు జరిగాయి.



రేపటి నుంచి షర్మిల శ్రీకాకుళం జిల్లా నుంచి తన ఎన్నికల యాత్రను ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మొదటిసారిగా జనం మధ్యకు వెళుతున్నారు. ఈ క్రమంలో సోమవారం నిరసన దీక్షలో పాల్గొన్న షర్మిల కే ంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. అస్సాం ఘటనపై రాహుల్‌గాంధీకి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని పౌరుల హక్కుల కోసం పోరాడే యాత్రను అడ్డుకోవడం, రాహుల్‌పై దాడి చేయాడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌వారు తప్ప మిగిలిన వారు ప్రశాంతంగా బతికే అవకాశం బీజేపీ ప్రభుత్వం లేకుండా చేస్తుందనే విషయం ప్రజలందరికీ అర్థమైందని, అయోధ్యలో రామమందిరానికి అస్సాంలో రాహుల్‌ గుడికి వెళ్లకుండా అడ్డుకోవడానికి సంబంధం ఏమిటని షర్మిల ప్రశ్నించారు.
రోజుకు మూడు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సమీక్షలు
23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల పర్యన చేపట్టారు. ఎక్కడికక్కడ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఆమె కలుస్తారు. సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీలో చేరే వారిని చేర్చుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే వారి నుంచి బయోడేటాలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం తొమ్మిది రోజుల పాటు కొనసాగుంది. రాష్ట్రంలోని ముఖ్య కాంగ్రెస్‌ నాయకులు షర్మిల వెంట ఉంటారు.
ఏపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కేవీపీ రామచంద్రరావు, సీడబ్లు్యసీ సభ్యులు ఎన్‌ రఘువీరారెడ్డి తదితరులు షర్మిలతో ఉన్నారు. వీరు రేపటి నుంచి ప్రాంరభమయ్యే కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ షర్మిల యాత్రలో పాల్గొంటారు. షర్మిలకు తగిన సూచనలు, సలహాలు వీరు ఇస్తుంటారని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. అయితే ఆదివారం బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఎవరితో సంబంధం లేకుండా షర్మిల చేసిన వ్యాఖ్యలు అటు వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీల్లో దడ పుట్టించాయి. ఇక కేంద్రంపై విరుచుకుపడ్డారు. జాతీయ కాంగ్రెస్‌ విధానం ఎలా ఉంటుందో ఆమె ప్రసంగంలో ప్రస్పుటంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె బాధ్యతల స్వీకరణ సందర్భంగా చేసిన ప్రసంగంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
Next Story