గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్టుపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. వంశీ పట్ల ఎలాంటి తొంతర పాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.


గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో బుధవారం ఊరట లభించింది. పోలీసులు తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వంశీ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 20వ తేదీ వరకు వంశీ అరెస్టుపై ఎలాంటి తొంతర పాటు చర్యలకు పాల్పడొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీ అరెస్టుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో వల్లభనేని వంశీ ఉన్నారని పేర్కొంటూ 71వ నిందితుడిగా ఆ కేసులో పోలీసులు చేర్చారు. మొదట కేసులో నిందితుడిగా వంశీని చేర్చినప్పటికీ విచారణలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిందితుడిగా వంశీని చేర్చడం విశేషం. ఈ కేసులో ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు తప్పదనే ప్రచారం జోరుగా సాగింది. ఇటీవల వల్లభనేని వంశీని అరెస్టు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో విపరితీమైన ప్రచారం సాగింది. పోలీసులు హాడావుడి, ప్రసార మాధ్యమాల్లో తనకు నెగటివ్‌గా వార్తలు రావడాన్ని పరిగణలోకి తీసుకొని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో పోలీసుల విచారణ ఒక్క సారిగా ఊపందుకుంది. నిందితులను గాలించి అరెస్టుల పర్వం కొనసాగించారు.
Next Story