
ఆ తల్లి మనసు ఎందుకు రాయిలా మారింది?
విషాదంగా మారిన తిరుపతిలో పాప అదృశ్యమైన ఘటన.
తిరుపతి నగరం కొరమీనుగుంటలో ఆరు నెలల పాప రమ్య అదృశ్యం ఘటన విషాదంగా మారింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిగుడ్డు శనివారం ఉదయం కనపించకుండా పోయింది. సాయంత్రానికి ఆ పసి గుడ్డు ఇంటికి సమీపంలోని మురుగునీటి కాలువలో శవమై పడి ఉండడాన్ని గుర్తించారు. ఈ సంఘటన వివరాలివి.
తల్లి వేదన: మూడు నెలల నా కూతురు రమ్యను ఎవరో ఎత్తుకుని వెళ్లారని తల్లి చందన శనివారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సీఐ రామకిషోర్ స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ కేసు సమాచారం తెలియడంతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్ణవర్థనరాజు కూడా ను ఛాలెంజ్ గా తీసుకున్నారు. సిబ్బందితో కలిసి ఆయన కూడా రంగంలోకి దిగారు. కొరమీనుగుంట ప్రాంతంలో స్వయంగా దర్యాప్తులోకి దిగారు.

తిరుపతి నగరం కొరమీనుగుంటలో విచారణ చేస్తున్న ఎస్పీ హర్షవర్థనరాజు
తిరుపతి నగరం మొత్తం నిఘా నీడలో ఉంది. కూడళ్ల తోపాటు అనేక ప్రాంతాల్లో అదృశ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఇంతటి పగడ్బందీ చర్యల మధ్య పసిబిడ్డను ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోవడం అసాధ్యం కాదని పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. నాలుగైదు బృందాలు ఏర్పాటు చేశారు. గాలింపు ముమ్మరం చేశారు. ఇదేమీ పట్టనట్లు రమ్య తల్లి చందన మాత్రం అందరినీ బిడ్డను ఎవరో ఎత్తుకుని వెళ్లారని నమ్మించింది. రంగంలోకి దిగిన పోలీసులు కూడా సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించడంలో ఒక బృందం నిమగ్నమైంది. కొరమీనుగుంట ప్రాంతం నుంచి నివాసాలు, ప్రయివేటు వ్యక్తులు, పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. ఎక్కడా చిన్న బిడ్డను ఎత్తుకుని వెళుతున్న వారి చిత్రాలు కనిపించలేదు. దీంతో