కృష్ణాలో నలుగు టీడీపీ అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌

గుడివాడ సభలో ఆవేదన, ఆక్రోశం కలగలిపి ప్రసంగం సాగింది. గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెడన అభ్యర్థులను సభలోనే ఖరారు చేశారు.


కృష్ణాలో నలుగు టీడీపీ అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌
x
Chandrababu Raa Kadali Raa Sabha Gudivada

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ‘రా కదిలారా’ సభలో గుడివాడ వేదికపై కృష్ణా జిల్లాలోని శాసనసభ అభ్యర్థులను చెప్పకనే చెప్పారు చంద్రబాబునాయుడు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పనితీరును దుయ్యబట్టారు. ఒక్కో నియోజకవర్గం గురించి చెబుతూ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పలానా వారు ఉన్నారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

గుడివాడలో ప్రధానంగా ఎమ్మెల్యేనే ప్రధాన సమస్య అని ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు ఉన్నారు. గెలిచే వ్యక్తి వెనిగండ్ల రాము ఉన్నారు జాగ్రత్త అంటూ కొడాలి నానీకి హెచ్చరిక జారీ చేశారు. కొడాలి నోరు అదుపులో పెట్టుకో హెచ్చరిస్తున్నా, భవిష్యత్‌ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, కొవ్వెక్కి బూతులు మాట్లాడుతున్నావు, వదిలిపెట్టను, రక్తం పొంగుతోంది అంటూ ఏమ్‌ తమ్ముళ్లూ ఇట్లాంటి వాళ్లను వదలాలా అంటూ ప్రజలతో వద్దూవద్దూ అంటూ నినాదాలు చేయించారు చంద్రబాబు.
మచిలీపట్నం పేర్ని నాని గురించి మాట్లాడుతూ ఇక్కడ బూతుల నానీ, అక్కడ బందరులో నీతుల నానీ అంటూ బాబు ఎద్దేవా చేశారు. పవన్‌కళ్యాణ్‌ను తిట్టేందుకే బందరు నానీ ఉన్నారని అనటంతో సభలో నవ్వులు విరిచాయి. నీతుల నానీ పనైపోయింది. కొడుకును రంగంలోకి దించారు. అక్కడ కొల్లు రవీంద్ర ఉన్నాడు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అంటే అక్కడ కూడా కొల్లు రవీంద్రకు లైన్‌క్లియరైంది.
పెడనలో చీటీ చిరిగి పెనమలూరు వెళ్లాడు జోగి, పెడనను పీడించిన రోగి జోగి అంటూ సెటైర్లు వేశారు బాబు. వర్కులో వాటా, ప్రతి దాంట్లోనూ వాటాలా మంత్రిగా జోగి పేరు సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు. జాగ్రత్త పెడనలో కాగిత కృష్ణప్రసాద్‌ ఉన్నారు అంటూ హెచ్చరించారు. అంటే అక్కడ కూడా అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని చెప్పొచ్చు.
గన్నవరం ఎమ్మెల్యే పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను పెంచిన తులసి మొక్క ఇప్పుడు గంజాయిమొక్కైంది. తిరటారు పడుతున్నా.. ఎవరికోసం.. ప్రజల కోసం.. లేకుంటే లెక్క చేయను. ఇతను చేయని దందాలు లేవు, గ్రావెల్‌ దందా, భూ దందా ఒకటేమిటి అన్ని దందాల్లోనూ అందెవేసిన చేయి. అందుకే ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడని అనటంతో జనం చప్పట్లు కొట్టారు.
పామర్రు కైలే అనిల్‌ కుమార్‌ దోపిడీలో ఫస్ట్, మట్టి బొక్కుడులో ఫస్ట్, ఇసుక దందా, ఇలా ప్రతి దాంట్లోనూ నొక్కుడే ఇటువంటి వ్యక్తిని ఇంకా మనం ఉండనివ్వాలా? అంటూ ప్రశ్నించి జనం చేత చప్పట్లు కొట్టించారు. పామర్రు నుంచి వర్ల కుమార్‌రాజాకు టిక్కెట్‌ ఇస్తున్నాననే విషయాన్ని చెప్పకుండా లోగుట్టుగా జాగ్రత్తగా ఉండండి మావాళ్లు ఉన్నారు. అంటూ హెచ్చిరించారు. వర్ల కుమార్‌ రాజా టీడీపీ ఎస్సీ ముఖ్య నాయకుడు వర్ల రామయ్య కుమారుడు.
ఇక అవనిగడ్డ గురించి మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పను. అవినీతి గడ్డ అవనిగడ్డ అంటూ తీవ్రంగా చంద్రబాబు స్పందించారు.
ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు బూతు శ్రీ, బూతు రత్న అంటూ అవార్డులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక ఎంపీ తెలుగుదేశం పార్టీ వారిని తిట్టడం లేదని టిక్కెట్‌ లేదు పొమ్మన్నాడు. ఇదీ ఈ రాస్ట్రంలో బూతుల రాజ్యం అంటూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు ఎంపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు. కనీసం ఐదేళ్లలో రెండు సార్లు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదంటే జగన్‌ రాజకీయ పోడకడలు రాజరికాన్ని తలపిస్తున్నాయన్నారు.
తాను పేదల పక్షం అంటున్నాడు. వేల కోట్లకు అధిపతి, దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రుల్లో ప్రధముడు ఇతను పేదవాడెలా అవుటాడు అంటూ సంక్షేమ పథకాలకు పాతర వేసిన వ్యక్తిని క్షమించొద్దని పిలుపు నిచ్చారు. సంక్రాంతి సంబరాల రాంబాబు జనం డబ్బుతో డ్యాన్స్‌లే వేస్తాడు. ఆర్థిక మంత్రి అప్పుల ఆర్థిక మంత్రిగా మారాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు.
Next Story