"దీపావళి ఊర్లు" వెనుక కథేమిటి?
ఓ ఊరిలో చీకటి.. మరో పల్లెలో పండుగ. ఆ దీపావళి గ్రామాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే.
పండుగల పేరుతో కూడా ఊర్లు ఉన్నాయి. ఇంతకీ 'ఈ దీపావళి ఊర్ల'లో విచిత్రాలు ఏమిటంటే.. సంకురాత్రిపల్లె (sankranti) ఉంది. ఈ విషయం పక్కకు ఉంచితే 'దీపావళి' పేరుతో కూడా ఓ జిల్లాలో రెండు గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఓ పల్లెలో ఈ రోజు (దీపావళి పండుగ) ఏ ఇంటిలో కూడా దీపాలు వెలిగించారు. అదే పేరుతో ఉన్న మరో దీపావళి గ్రామంలో ఐదు రోజులు పండుగ నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఈ రెండు గ్రామాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఆ దీపావళి గ్రామాలను చూసొద్దామా..!
దేశంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. రూ. వందల కోట్ల రూపాయల టపాకాయాలు కాల్చడం ఆనవాయితీ. దీపావళి పేరుతో ఉన్న ఓ పల్లెలో దశాబ్దాల కాలంగా విషాదంగా పాటించే విధానం కలచివేస్తుంది. ఇంకో గ్రామంలో మాత్రం ఐదు రోజుల పాటు పండుగ జరుపుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.
శ్రీకాళుళం జిల్లా గార మండలంలోని దీపావళి గ్రామానికి ఆ పేరు రావడం వెనుక చారిత్రక నేపథ్యంతో కూడిన కథ ఉంది.
ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా ఈ దీపావళి గ్రామం కనిపిస్తుంది. దీనికి ఈ పేరు సార్థకం కావడం వెనుక ఉన్న చరిత్రపై గ్రామస్తులు ఏమంటున్నారంటే..
శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగరాజు కూర్మనాథఆలయానికి వచ్చే వారంట. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతుంటే, కళ్లు తిరిగి పడిపోయారు. ఆని ఆ సమయంలో గ్రామస్తులు ఆయనకు సపరిచర్యలు చేశారు.
"రాజు కోసం గ్రామంలో దీపాలు వెలిగించడం తోపాటు ఆయనకు చేసిన సేవలతో ఆయన కోలుకున్నారు" అనేది గ్రామస్తులు చెప్పే కథనం. దీంతో స్పృహలోకి వచ్చిన ఆ రాజు దీపావళి పండుగ రోజు నాకు మళ్లీ ఊపిరి పోశారు. ఈ రోజు నుంచి గ్రామం పేరు దీపావళి అని నామకరణం చేశారు" అని వివరించారు. దీంతో రికార్డుల్లో కూడా ఈ గ్రామానికి అదేపేరు స్థిరం చేశారు.
శ్రీకాకుళంకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దీపావళి గ్రామం గార మండలంలో ఉంది. 143 హెక్టార్లలో విస్తరించిన దీపావళి గ్రామంలో 2011 గణాంకాల ప్రకారం 300 ఇళ్లతో 1,181 జనాభా ఉం ది. గ్రామంలో పురుషులు 586, మహిళలు 595. ఎస్సీలు 50 మంది, ఎస్టీలు ఆరుగురు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
దీపాలతో ప్రదర్శన
పండుగ రోజు ఆ రోజుల్లో రాజరికం నుంచి లభించిన ఆతిథ్యాన్ని గుర్తు చేసుకుంటూ, సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుందని చెబుతున్నారు. కొత్త అల్లుళ్లను స్వాగతించడం, విందులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇదంతా ఓ ఎత్తు కాగా, గ్రామం మొత్తం వేలదీపాలతో ప్రమిదలు వెలిగించి, కాంతులతో దేదీప్యమానం చేస్తారు. తమ
పూర్వీకులు రాజు ప్రాణాలు కాపాడిన చరిత్రను స్మరించుకుంటూ, గ్రామ పెద్దల సారధ్యంలో సాంప్రదాయ దుస్తులు ధరించి నూనా దీపాలతో గ్రామస్తులు ప్రదర్శన నిర్వహిచడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రదర్శన కూర్మనాథస్వామి ఆలయం వద్ద ముగించి, పూజలు అందిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. వందల ఏళ్ల నుంచి
"ఈ దీపావళి అనే గ్రామంలో దీనిని ఆచారంగా నిర్వహిస్తారు" అని సీనియర్ జర్నలిస్టు టీవీకే. శాస్త్రి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
ఎలుక మిగిల్చిన విషాదం
శ్రీకాకుళం జిల్లాలోనే మరో గ్రామం పేరు కూడా దీపావళి. ఇక్కడ ఓ ఎలుక తెచ్చిన తంట. గ్రామాన్ని దీపావళి పండుగకు దూరం చేసింది. టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీలో కూడా "దీపావళి" అనే గ్రామం ఉంది. ఈ గ్రామం మొత్తం దీపావళి సంబరాలకు దూరంగా ఉంటుంది. ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా వందేళ్ల నుంచి ఇదే పరిస్థితి అని చెబుతున్నారు. గ్రామంలో ప్రతి ఇల్లు గుడిసెలే. కరెంటు సదుపాయానికి దూరంగా ఉండేది. దీంతో గతంలో నూనె దీపాలు మాత్రమే వాడేవారు. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక దీపాన్ని దొర్లించడంతో ఓ గుడిసెకు అంటుకున్న మంటలు, ఊరంగా వ్యాపించాయి. దీంతో గ్రామంలో విషాదం ఏర్పడింది.
రణస్థలం మండలం ఉన్నానపాళెం గ్రామంలో పూర్వీకుల కాలం నుంచి నాగులచవితి, దీపావళి జరుపుకోవడం లేదంటున్నారు. పూర్తం దీపావళి తరువాత నాగదేవతను కొలిచేవారు. నాగుల చవితి రోజు పూజల అనంతరం పుట్టలో పాలుపోయడానికి వెళ్లారంట. ఇంటికి తిరిగి వచ్చే సరికి ఓ ఇంటిలో ఊయలలో ఉన్న చంటి బిడ్డ ప్రాణాలు కోల్పాయి విగతజీవిగా కనిపించాడు. మరో ఏడాది నాగులచవితి రోజు పుట్ట వద్ద పూజల అనంతరం తిరిగి వచ్చే సరికి ఓ కుటుంబానికి చెందిన ఆవులు, ఎడ్లు ప్రాణాలు కోల్పోయి పడి ఉండడం కనిపించింది. అప్పటి నుంచి నాగుల చవితి, దీపావళి పండుగకు దూరమైనట్లు చెబుతున్నారు. కాగా,
మారుతున్న కాలంలో శాస్త్రీయ ఆలోచనలతో ఉన్న యువత గ్రామంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మూఢాచారాలకు స్వస్తి చెప్పి, అందరితో సమానంగా పండుగలు జరుపుకోవడానికి ఇప్పుడిప్పుడే పున్నానపాలెం జీవనవిధానంలో మార్పులకు యత్నిస్తున్నారని ఆ ప్రాంత జర్నలిస్టులు చెబుతున్నారు.
Next Story