అసెంబ్లీ తొలి రోజు సమావేశాల్లో జగన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీలోనికి పంపకుండా నిలువరించారు. తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తీవ్ర స్వరంతో పోలీసులను హెచ్చరించారు. తర్వాత అనుమతించారు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజునే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, వైఎస్‌ జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలోకి వెళ్తున్న జగన్‌తో పాటు ఆయన పార్టీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలోకి వెళ్తున్న జగన్, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతిలోని ప్ల కార్డులను బలవంతంగా లాగేసుకునే ప్రయత్నం చేశారు. లాక్కున్న ప్ల కార్డులను చింపేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీనిని జగన్‌ తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసుల చర్యలపై జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వైజన్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడే బైటాయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కొద్ది సేపు ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లోని పేపర్లను గుంజుకొని, లాక్కొని మీకిష్టం వచ్చినట్లు చింపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ల కాలం ఇలాగే ఉండదని, మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామని, క్యాప్‌ మీద ఉన్న మూడు సింహాలకు ఉన్న అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వారికి సెల్యూట్‌ కొట్టమని కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమని, ఈ విషయాలను గుర్తుంచుకోవాలని పోలీసులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పోలీసుల జులం నశించాలని పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. అనంతరం వారిని లోనికి పంపించారు.
అసెంబ్లీ ప్రారంభ సమావేశం సందర్భంగా ప్రభుత్వ పాలన తీరుపై నిరసనలు తెలిపేందుకు జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న హత్యలు, అల్లర్లు వంటి సంఘటనలపై ఫొటోలతో కూడిన ఫ్లకార్డులను తమతో తెచ్చుకున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీలోకి వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు అడ్డగించారు. సభ్యుల చేతుల్లోని çకొన్ని ³్లకార్డులను లాక్కొని చింపేశారు. దీంతో కొద్ది సేపు ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కొద్ది సేపు తర్వాత లోనికి అనుమతించారు. తెల్ల చొక్కాలు, నల్ల ప్యాంట్లు, భుజంపైన నల్ల కండువాలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు.
Next Story