విడుదలకు రెడీగా మూడో జాబితా
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల మూడో జాబితా రెడీ అయింది. రేపో, ఎల్లుండో విడుదల కానుంది.

YSRCP FLOG
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో జాబితా రెడీ చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను మార్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతలుగా 35 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. మూడో జాబితా కూడా ఈ మేరకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
మూడో జాబితాలో విశాఖపట్నం పార్లమెంట్‌కు బొత్స ఝాన్సీ, అనకాపల్లి పార్లమెంట్‌కు కిలారి పద్మ, విజయనగరం పార్లమెంట్‌కు మజ్జి శ్రీనివాసరావు, కర్నూలు గుమ్మనూరు జయరాం, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయవాడ కేశినేని నాని, అమలాపురం ఉన్నమట్ల ఎలీజా, కాకినాడ చలమశెట్టి సునీల్, నంద్యాల సినీనటుడు అలీ, నర్సరావుపేట నాగార్జునయాదవ్, రాజమండ్రి సినీ డైరెక్టర్ వివి వినాయక్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ స్థానానాలకు సంబంధించి ఆలూరు విరూపాక్షి, చిత్తూరు విజయ ఆనందరెడ్డి, చింతలపూడి కె విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, మడకశిర శుభకుమార్, దర్శి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మార్కాపురం జంకె వెంకటరెడ్డి, గూడూరు మేరిగ మురళి, గంగాధర నెల్లూరుకు కృపాలక్ష్మి (మంత్రి నారాయణస్వామి కుమార్తె), నందికొటుకూరు గంగాధర్, పెందుర్తి ఆదిప్‌రాజ్, నెల్లూరు కృపాలక్ష్మి, పేర్లు ఖరారైనట్లు సమాచారం. అయితే ఈ పేర్లలో ప్రకటించేలోపు మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది.
Next Story