తుపాన్‌ క్రాసైంది ఇక్కడ... ఆయన పర్యటించేది అక్కడ..

ముఖ్యమంత్రి ముందు వస్తాడని చూశాను. రాలేదు. అందుకే నేను వచ్చా. తప్పుపడతారా? రాజకీయం చేస్తారా: చంద్రబాబు


తుపాన్‌ క్రాసైంది ఇక్కడ... ఆయన పర్యటించేది అక్కడ..
x
తుపాన్‌ బాధిత రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు


ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ పరామర్శకు ముందు రాకూడదు. ఎందుకంటే విమర్శించడం కోసమే వచ్చారంటారు. ముఖ్యమంత్రి ముందు వస్తాడని చూశాను. రాలేదు. అందుకే నేను ముందుగా వచ్చానని ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల మండలంలోని మంతెనవారిపాలెం, పిట్టలవానిపాలెం, చందోలు, బుద్దాం, కర్లపాలెం, నందాయపాలెం, నల్లమోతువారిపాలెం, హైదర్‌పేట, నందిరాజుతోట గ్రామాల్లో శుక్రవారం పర్యటించి తుపాన్‌వల్ల దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. పొలాలు పరిశీంచారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..

చుట్టపు చూపుగా తిరుపతి వెళ్లి అక్కడి నుంచి వస్తున్నాడు. తుపాన్‌ క్రాసైంది ఇక్కడ, ఆయన పర్యటించేది అక్కడ. నాలాంటి వాళ్లను కూడా జైల్లో పెట్టించగలుగుతాడు. ఎలాంటి తప్పుచేయని నన్ను ఉన్న పలంగా జైల్లో పెట్టించారంటే అర్థం చేసుకోవాలి. మీ అందరినీ బెదిరించవచ్చని ఇలా చేశాడు. వచ్చే మూడు నెలల తరువాత ఏమవుతుందో చూద్దాం. తప్పు జరిగితే ప్రశ్నించాలా? నేను ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని పొగడాలా? నేను కూడా పొగిడితే మీ బతుకులు ఏమవుతాయి. మీ తరుపున మాట్లాడే నాయకులను జైల్లో పెడతారు. మీరు మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు.
కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చడానికి వచ్చాం
రైతులు, కౌలు రైతులు, పేదలు పూర్తిగా నష్టపోయారు. నేరుగా రైతులతో మాట్లాడాను. ఇది అసాధారణమైన తుపాన్‌. వారం రోజులు దాగుడు మూతలు ఆడి తీవ్రస్థాయిలో వర్షం విరుచుకు పడింది. ఈ తుపాన్‌ కోస్తా ప్రాంతాన్నంతా ముంచెత్తింది. నారుమళ్లు పోయాయి. పంటలు నీటి పాలయ్యాయి. కరువు వల్ల సగం పంట వేయలేదు. వేసిన పంట నీళ్ల పాలైంది.
ఎక్కువగా నష్టపోయింది కౌలు రైతులు
ఇక్కడ నష్టపోయింది కౌలు రైతులు ఎక్కువ మంది. ఎకరాకు రూ. 25వేలు కౌలు ఇవ్వాలి. తుపాన్‌ను నివారించలేము. మానవ తప్పిదం ఉంది. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తుపాన్‌ పరిస్థితి ఏమిటనేది ముందుగానే తెలుసుకోవచ్చు. ధాన్యం పట్టుకునేందుకు గోతాలు కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న డ్రైనేజీ కాలువలు గాలికొదిలేశారు. ఈ నీరు పొలాల మీద పడుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ యంత్రాంగమే రాలేదు.
పంటల బీమా ఎక్కడ?
పంటల బీమా ఉంది. కొంత కేంద్రం, కొంత రాష్ట్రం కలిపి ఇచ్చే వారు. ఫసల్‌ బీమా అంతా కూడా రబీకి డిసెంబరుకు ఫైన్‌ చేయాలి. వెబ్‌సైట్లో చూస్తే 16 మంది రైతులకు మాత్రమే బీమా ఉంది. ఒక రైతు పది లక్షల కౌలు ఇచ్చారు. 20 బస్తాలకు మించి ధాన్యం రావడం లేదు. కనీసం 20 శాతం కూడా రాకపోతే అప్పులు ఎలా తీరుస్తారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులు రాష్ట్రంలో రెండో స్థానం.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 2014 ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ. 10వేలు ఉంటే దానిని రూ. 20వేలు చేశాను. ఇప్పుడు రూ. 30వేలైనా ఇవ్వాలి. ఇచ్చాడా ముఖ్యమంత్రి అంటూ రైతులను ప్రశ్నించాడు. ఐదేళ్లుగా రైతులకు ఏమైనా ఇన్‌పుట్స్‌ ఇచ్చారా? మీలో చైతన్యం రావాలి. పోరాడటానికి మీరు బయటకు రావాలి. అన్యాయంపై పోరాడదాం. మీరు పోరాడకపోతే నష్టపోయిన వారికి మూడు నెలల తరువాత పరిహారం ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా. ఎన్నికల ముందు మాటలు చెప్పి, ముద్దులు పెట్టి ఎన్నికలైన తరువాత పట్టించుకోకుంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.

Next Story