పవన్ మాటల వెనుక తిక్క కాదు.. ఓ లెక్క ఉందంట..!
x
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పవన్ మాటల వెనుక తిక్క కాదు.. ఓ లెక్క ఉందంట..!

కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. లా అండ్ ఆర్డర్ గాడితప్పందని ప్రభుత్వాన్ని ఎందుకంతలా ఇరుకున పడేశారు. హోంమంత్రి మరింత ఆజ్యం పోశారా?


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటల మంటల వెనుక అంతర్లీనంగా పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. పదవులు సంగతి అలా ఉంచితే టీడీపీ శ్రేణుల నుంచి జనసైనికులపై దాడుల నేపథ్యంలోనే అక్కసు వెళ్లగక్కారని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తర్వాత ఎందుకు అంతగా స్పందించారు. శాంతి భద్రతల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేసే విధంగా ఎందుకు మాట్లాడారు.

"చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం అబ్బీ కండ్రిక ( ఏఏం. పురం) లో నాలుగేళ్ల గిరిజన బాలిక హత్యాచారానికి గురైన ఘటన జరిగింది" దీనిపై సీఎం ఎన్ చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను ఆ గ్రామానికి వెళ్లాలని కూడా ఆదేశించారు. ఆదివారం అబ్బీపురం గ్రామానికి వచ్చిన హోం మంత్రి అనిత హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులు మమత, మధుకు రు. 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిదనడంలో సందేహం లేదు. నిందితుడికి కూడా మూడు నెలల్లో శిక్షపడేలా చేస్తామని కూడా హోంమంత్రి హామీ ఇచ్చారు.
నగరి ఘటన అంతలా పవన్ కళ్యాణ్ ను కదిలించిందా? లేక మనసులో మరో కారణం ఉందా అనేది చర్చకు వచ్చింది.
"నాకు తిక్కుంది. దానికో లెక్క ఉంది" గబ్బర్ సింగ్ నిసిమాలో డైలాగ్ ఇది. డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో శాంతి, భద్రతలపై సమస్యపై చేసిన ఘాటు వ్యాఖ్యల వెనక కూడా అంతర్లీనంగా ఓ కథ, లెక్క ఉన్నట్లే కనిపిస్తుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ "నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి" అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా కలకలం రేపాయి.
"శాంతి భద్రతలపై 10 సార్లు నాతో చెప్పించుకోవద్దు" అని ఏకంగా హోం మంత్రి అనితను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక చేశారు. అంతటితో ఊరుకొని పవన్ కళ్యాణ్..
"వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసిన అప్పుల తోపాటు నేరాలు ఘోరాలను కూడా పరిచయం చేశారు. అధికారులు అలసత్వం కూడా రాష్ట్రానికి వారసత్వంలో అందించారు" అనే పోలీసు శాఖకు కూడా వదలకుండా దుమ్ము దులిపేశారు.
హోంమంత్రి ఆజ్యం పోశారా?

పవన్ కల్యాణ్ వ్యాఖ్యాలపై అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీటుగానే స్పందించినట్లు కనిపిస్తోంది.
"పవన్ కళ్యాణ్ ఏ కేసుకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తారో నాకు తెలుసు. ఆయనతో నేనే స్వయంగా మాట్లాడుతా" అని హోం మంత్రి అనిత వ్యాఖ్యానించారు. వెంటనే సర్దుకున్న ఆమె నాకు సలహా ఇచ్చే విధంగానే ఆయన మాట్లాడారు. అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
Low And Orderపై నేను, సీఎం చంద్రబాబు పోలీసులు నిత్యం మాట్లాడుతున్నాం. వాటిలో పవన్ కల్యణ్ కూడా భాగమే. "ఆయనకు అన్ని విషయాలు తెలిసినవే అన్నారు. పవన్ కల్యాణ్ మాటల్లో రాజకీయం లేదు. అంటూనే ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు" అని కూడా అన్నారు. అంటే.. పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి పిఠాపురం లో జరిగిన సంఘటన ఉందనే విషయం ఆమె చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది.

డీజీపీ ద్వారకా తిరుమల రావు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలపై స్పందించడానికి నిరాకరిస్తూనే "రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం" అన్నారు. "గత ఐదేళ్లలో తప్పులు జరిగాయి" అని అంగీకరించారు. పోలీస్ శాఖ తీరును తప్పుబట్టినట్లే కనిపించింది. ఆ తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఓ విషయం ప్రస్తావించాలి
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడి నాలుగు నెలలు గడిచింది. డిప్యూటీ సీఎం గా జనసేన చే పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఇష్టమైన అటవీ పర్యావరణం, గ్రామీణ అభివృద్ధి శాఖలు కేటాయించినప్పుడే సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి నాకు ఇష్టమైన శాఖలు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు పిఠాపురం ఎమ్మెల్యే గా గెలిచిన పవన్ కళ్యాణ్ కు హోం మంత్రి దక్కే అవకాశం ఉంది అనే వార్తలు పుకార్లు చేశాయి. తాను ఫలానా శాఖ కావాలని పట్టుపట్టడం లేదు అని కూడా ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం. కేటాయించిన శాఖలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతవరకు ఓకే.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి అక్టోబర్ 12వ తేదీకి నాలుగు నెలలు దాటి ఐదో నెల జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మహిళలపై అత్యాచారం, బాలికలపై అఘాయిత్యాలకు కొదవలేదు. వాటన్నింటినీ పక్కన ఉంచితే, రాయలసీమలో జరిగిన వరుస సంఘటనలు మహిళలు, బాలికల్లో అభద్రతాభావం ఏర్పడింది. పోలీసు శాఖపై ఎడతెగని విమర్శలు వచ్చాయి. హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించి ఆదేశాల జారీ చేస్తున్న ప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సింది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లే కదా. అంటే వారి పనితీరు కూడా బాగాలేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బహిర్గతమైంది.
వీటిపై స్పందన లేదే..
నగిరి నియోజకవర్గం వడమాలపేటలో జరిగిన సంఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారా? కొన్ని సంఘటనలు పరిశీలిస్తే మత్రం కాదనే సమాధానం చెబుతాయి.
2024 జూలై 21 : నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఓ బాలికపై హత్యాచరం జరిగింది. మృతదేహం దొరకలేదు. ముగ్గురు బాలలపై సందేహంతో వారిలో ఒకరి మేనమామ పోలీస్ విచారణలో ప్రాణం వదిలాడు. గుండెపోటు అని చెప్పినా, సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది.
2024 అక్టోబర్ 5: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ముస్లిం బాలిక హత్యకు గురైంది. బంధువు అయిన మహిళే ఈ ఘాతుకానికి పాల్పడిదనే విషయాన్ని చిత్తూరు ఎస్పీ మణికంఠ గంటల వ్యవధిలోనే దర్యాప్తులో తేల్చారు.
2024 అక్టోబర్ 19 : కర్నూలు జిల్లా అస్పరి మండలం నగునూరుకు చెందిన ఇంటర్ విద్యార్థినిని నోట్లో ఓ ప్రమోన్మాది పురుగుల మందు పోసి హత్య చేశాడు.
2024 అక్బోబర్ 20 : కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బీసీ సామాజికవర్గం (బీసీ) విద్యార్థినిని వివాహితుడు పెట్రోల్ పోసి, నిప్పంటించిన ఘటన విషాదం నింపింది. ఇక్కడ బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం చెక్కు అందించారు.
ఇవి మచ్చుకు ఇవి సంఘటనలు మాత్రమే. ఈ సంఘటనలన్నింటిలో కూడా దళితులు, బీసీ బాలికలే బాధితులు.
ఆ తిక్క వెనుక లెక్క ఇదేనా..?
ఓట్లు చీలనివ్వను అని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో తనతో పాటు జనసేన అభ్యర్థులను కోస్తా ప్రాంతంలోనే పోటీ చేయించారు. రాయలసీమతో సహా మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఇటీవల జరిగిన సంఘటనలు పవన్ కల్యాణ్ ఆగ్రహానికి ఆజ్యం పోశాయనే ప్రచారం సాగుతోంది. ఆ కోవలోనే తాజాగా ఆయన సీఎం చంద్రబాబునే షేక్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ గాడితప్పిందనే మాటలు నేపథ్యం అని చెబుతున్నారు.
1. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో టీడీపీ- జనసేన మధ్య చిచ్చు రగిలిచిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాబత్తుని రాజశేఖర్ టీడీపీ కండువాతో మాత్రమే వచ్చారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ, జనసేన కండువా వేసుకోవాలని ఆ పార్టీ నేత మర్రెడ్డి శ్రీనివాసరావు కోరారని తెలిసింది. దీంతో మాటా పెరిగి మర్రెడ్డి శ్రీనివాసరావుతో పాటు ఆయన వెంట ఉన్న అనుచరులు కూడా టీడీపీ శ్రేణులు చితకబాదారు.
2. సామాజిక పింఛన్ల పంపిణీలో జనసేన పార్టీ నాయకులు దెందులూరు నియోజకవర్గంలో అధికారుల వెంట తీసుకుని బయలుదేరారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్దతుదారులు జనసేన శ్రేణులపై దాడి చేశారు. "రౌడీ మూకలు జనసేనలోకి చొరబడ్డాయి" అని ఎమ్మెల్యే చింతమనేని ఘాటుగానే వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన వారి వల్లే సమస్య వచ్చిందని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం.
3. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యకర్త ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అందులో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర ఫోటో లేకపోవడం వివాదానికి దారి తీసింది. ఆ janasena కార్యకర్తపై కూడా అక్కడ టీడీపీ ద్దతుదారులు దాడి చేశారు.
4. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొండబాబు మధ్య వివాదం రగులుతోంది. దీపావళి పండుగ నేపథ్యంలో టపాకాయల విక్రయాల లైసెన్సును ఎంపీ ఉదయ శ్రీనివాస్ జనసేన మద్దతు ధరలకే మంజూరు చేయించారని సమాచారం. దీంతో టీడీపీ- జనసేన మధ్య అగాధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో తమకు దుకాణాల లైసెన్సులు దక్కకుండా చేశారంటూ టిడిపి నాయకులు ధర్నాలు కూడా దిగి, ఘర్షణ పడ్డారని తెలిసింది.
అందుకేనా పిఠాపురం పర్యటన
ఈ సంఘటనల నేపథ్యంలోనే ఇటీవల రెండు రోజుల పాటు తన సొంత పిఠాపురం నియోజకవర్గం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్లారనే వార్తలు వినిపించాయి.
టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి జనసేన నుంచి సంపూర్ణ సహకారం అందించాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు ఉంది. అధికారంలోకి రావడానికి జనసేన సీట్లు కూడా తగ్గించుకుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చాలాసార్లు ప్రస్తావించారు.
లోపించిన సమన్వయం
ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో టిడిపి- జనసేన నాయకులు శ్రేణుల మధ్య పొంతన కుదరడం లేదు. ఎవరికి తోచిన తీరుగా వారు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో కోస్తా ప్రాంతంలో తమ పార్టీ శ్రేణులపై దాడులకు దిగడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనల నేపథ్యంలోనే "రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గాడి తప్పింది. ఒకటి పది సార్లు నాతో చెప్పించుకోవద్దు" అని హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన మాటలకు సమాధానంగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఓ వ్యాఖ్య చేశారు. "పవన్ కళ్యాణ్ ఏ కేసు విషయమై స్పందించారో నాకు తెలుసు. ఆయనతో నేనే మాట్లాడతా" అని హోం మంత్రి అనిత సమాధానం ఇచ్చారు. అంటే ఉభయగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు అని హోం మంత్రి అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది.
మంత్రివర్గంలో చర్చ?
ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్ మాటల నేపథ్యంలో వైసీపీకి అస్త్రం దొరికినట్లు అయింది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటు, అంతకుముందే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, పార్లమెంట్లో మాట్లాడవలసిన అంశాలపై చర్చించడానికి ఆరవ తేదీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగునున్నది. ఈ సమావేశంలో ఎలాంటి హాట్ డిస్కషన్ జరుగుతుందనేది వేచి చూడాలి.


Read More
Next Story