ఈ సారి కొన్ని జిల్లాల నుంచి అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అధికంగా విజయనగరం జిల్లా నుంచి ఐదుగురు ఉంటే నాలుగు జిల్లాలో ఒక్కరు కూడా లేరు.


ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అసెంబ్లీలో మహిళా నేతలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పోలవరం నుంచి తెల్లం రాజలక్ష్మి, గోపాలపురం నుంచి తానేటి వనితలు పోటీ చేసినా గెలుపు సాధ్యం కాకపోవడంతో ఈ జిల్లా నుంచి మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కొవ్వూరు(ఎస్సీ) నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు నుంచి కందులు దుర్గేష్, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుంచి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, ఉండి నుంచి కనుమూరు రఘురామకృష్ణరాజు, తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, ఏలూరు నుంచి బాడేటి రాధాకృష్ణయ్య, గోపాలపురం(ఎస్సీ) నుంచి మద్దిపాటి వెంకటరాజు, పోలవరం(ఎస్టీ) చిర్రి బాలరాజు, చింతలపూడి (ఎస్సీ) సొంగా రోషన్‌కుమార్‌ గెలుపొందారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈ సారి మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి దిగినా ఈ ముగ్గురు మహిళా అభ్యర్థులు ఓటమిని చవి చూశారు. ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బూదాల అజితారావు పోటీ చేయగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ గెలుపొందారు. దర్శి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పోటీ చేయగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. ఒంగోలు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తుర్కపల్లి నాగలక్ష్మి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామంచర్ల జనార్థనరావు గెలుపొందారు. దీంతో ఈ జిల్లాలో కూడా అసెంబ్లీలో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తక్కిన సీట్లైన పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుంచి మద్దులూరి మాలకొండయ్య, సంతనూతలపాడు నుంచి బిఎన్‌ విజయ్‌కుమార్, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, కొండపి నుంచి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు నుంచి ముతుముల అశోక్‌రెడ్డి, కనిగిరి నుంచి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గెలుపొందారు.
చిత్తూరు జిల్లా నుంచి కూడా అసెంబ్లీలో మహిళా నేతలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నగరి నుంచి ఆర్కే రోజా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగాను, గంగాధరనెల్లూరు నుంచి కే కృపాలక్ష్మి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ జిల్లాకు చెందిన మహిళా నేతలకు అసెంబ్లీలో అవకాశం లేకుండా పోయింది.
తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిషన్‌కుమార్‌రెడ్డి, మదనపల్లె నుంచి షాజాహాన్‌ బాష, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి నుంచి పులపర్తి వెంకట మనిప్రసాద్‌(నాని), తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుదీర్‌రెడ్డి, సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం, నగరి నుంచి గాలి భానుప్రకాష్, గంగాధర నెల్లూరు నుంచి డాక్టర్‌ వీఎం థామస్, చిత్తూరు నుంచి గురజాల జగన్‌మోహన్, పూతలపట్టు నుంచి కే మురళీమోహన్, పలమనేరు నుంచి ఎన్‌ అమరనాథ్‌రెడ్డి, కుప్పం నుంచి నారా చంద్రబాబునాయుడు గెలుపొందారు.
కృష్ణా జిల్లా నుంచి కూడా మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ నుంచి వెనిగండ్లరాము, పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్, మచలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ నుంచి మండలి బుద్దప్రసాద్, పామర్రు నుంచి వర్ల కుమారరాజా, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్‌ గెలుపొందారు. ఇక్కడ ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీతో పాటు ఇతర పార్టీలు కూడా మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించ లేదు. పోటీ సమయంలోనే మహిళలు లేకుండా పోయారు. దీంతో కృష్ణా జిల్లా నుంచి కూడా అసెంబ్లీలో మహిళా నేతలకు అవకాశం లేకుండా పోయింది.
Next Story