Bank Holidays | బ్యాంకుల్లో ఏమైనా పనుంటే ఈవేళే పూర్తి చేస్కోండి!
4 రోజులు బ్యాంకులకు సెలవులు. ఏమైనా పనుంటే డిసెంబర్ 24, 27 తేదీల్లో పూర్తి చేసుకోవాలని బ్యాంకు అధికారులు సలహా ఇస్తున్నారు.
బ్యాంకులకు డిసెంబర్ 25 నుంచి 31 మధ్య 4 రోజుల పాటు సెలవులు (Bank Holidays) రానున్నాయి. డిసెంబర్ 25, 2024న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఇక డిసెంబర్ 26న కూడా బాక్సింగ్ దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు కాకుండా పలు చోట్ల బ్యాంకులకు హాలిడే ఉంది. ఆ తర్వాత శుక్రవారం రోజు బ్యాంకులు పనిచేస్తాయి. కానీ తర్వాత డిసెంబర్ 28, 2024న నాలుగవ శనివారం, డిసెంబర్ 29, 2024న ఆదివారం బ్యాంకులకు హాలిడే. దీంతో మొత్తం ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. మరోవైపు డిసెంబర్ 30న (సోమవారం) యు కియాంగ్ నంగ్‌బా పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూసివేస్తారు. డిసెంబర్ 31న (మంగళవారం) మిజోరం, సిక్కింలో నూతన సంవత్సర వేడుకలు, లాసాంగ్, నామ్‌సూంగ్ కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఏదైనా బ్యాంక్ తో పని ఉంటే డిసెంబర్ 24 లేదా డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం పూర్తి చేసుకోవాలి. డిసెంబర్ చివరి వారంలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా విడుదల చేసే బ్యాంకు సెలవుల జాబితాలో జాతీయ, ప్రాంతీయ సెలవు రోజులు ఉంటాయి.
ఒక రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటే మరోచోట అదే సెలవులు ఉంటాయని కాదు. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా వినియోగదారులు ఆన్‌లైన్ సేవల సహాయం తీసుకోవచ్చు. UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలపై బ్యాంక్ సెలవులు ఎటువంటి ప్రభావం చూపవు. కాబట్టి బ్యాంక్ సెలవుల సమయంలో కస్టమర్‌లు ఆన్‌లైన్ సేవలను ఉపయోగించవచ్చు.
Next Story