ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు ప్రభుత్వం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించింది. ఆ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించింది. గత కొద్ది రోజులుగా దీనిపై చర్చ సాగుతోంది. ఏ జిల్లాకు ఎవరిని నియమిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగింది. తాజాగా దీనికి తెరదించుతూ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్‌ నేత అచ్చెన్నాయుడుకి, మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌లకు మాత్రం రెండేసి జిల్లాలకు చొప్పున ఇన్‌ఛార్జ్‌ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రుల వివరాలు
శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరం – వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు
విశాఖపట్నం – డోలా బాలవీరాంజనేయ స్వామి
అల్లూరి – గుమ్మడి సంధ్యారాణి
అనకాపల్లి – కొల్లు రవీంద్ర
కాకినాడ – పి నారాయణ
తూర్పుగోదావరి – నిమ్మల రామానాయుడు
పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్‌
ఏలూరు – నాదెండ్ల మనోహర్‌
కృష్ణా – వాసంశెట్టి సుభాష్‌
ఎన్టీఆర్‌ – సత్యకుమార్‌ యాదవ్‌
గుంటూరు – కందుల దుర్గేశ్‌
బాపట్ల – కొలుసు పార్థసారథి
ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు – మహ్మద్‌ ఫరూఖ్‌
కర్నూలు – నిమ్మల రామానాయుడు
నంద్యాల – పయ్యావుల కేశవ్‌
అనంతపురం – టీజీ భరత్‌
తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు – అనగాని సత్యప్రసాద్‌
కడప – ఎస్‌ సవిత
అన్నమయ్య – బి.సి. జనార్దన్‌ రెడ్డి
చిత్తూరు – రాంప్రసాద్‌ రెడ్డి
Next Story