ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థులు వీరే

ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంట్‌ సభ్యుల జాబితాను శనివారం ఇడుపులపాయలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థులు వీరే
x
ఆంధ్రప్రదేశ్ లో వైెఎస్సార్సీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న ఎంపీ నందిగం సురేష్

వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను బాపట్ల పార్లమెంట్ ెఎంపీ నందిగం సురేష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఇడుపులపాయ ఎస్టేట్లో సీట్లు ప్రకటించడం విశేషం. స్వర్గీయ ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ టిక్కెట్లు పొందిన నాయకులతో పాటు సీఎం నివాళులర్పించారు.

అభ్యర్థుల్లో 11 మంది బీసీలు, 4గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, 9 మంది ఓసీలు ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ సభ్యుల వివరాలు
శ్రీకాకుళం – పేరాడ తిలక్‌ – బీసీ కళింగ
విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌ – బీసీ తూర్పు కాపు
విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ – బీసీ తూర్పు కాపు
అరకు – చెట్టి తనూజ రాణి – ఎస్టీ వాల్మీకి
కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌ – ఓసీ కాపు
అమలాపురం – రాపాక వరప్రసాద్‌ – ఎస్‌సీ మాల
రాజమండ్రి – డా గూడురి శ్రీనివాసులు – బీసీ శెట్టి బలిజ
నర్సాపురం – గూడూరి ఉమా బాల – బీసీ శెట్టి బలిజ
ఏలూరు – కారుమూరి సునీల్‌ కుమార్‌ – బీసీ యాదవ
మచిలీపట్నం – డా సింహాద్రి చంద్రశేఖర్‌రావు – ఓసీ కాపు
విజయవాడ – కేశినేని శ్రీనివాస్‌ (నాని) – ఓసీ కమ్మ
గుంటూరు – కిలారి వెంకట రోశయ్య – ఓసీ కాపు
నర్సరావుపేట – డా పి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ – బీసీ యాదవ
బాపట్ల – నందిగాం సురేష్‌ బాబు – ఎస్‌సి మాదిగ
ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి – ఓసీ రెడ్డి
నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి – ఓసీ రెడ్డి
తిరుపతి – మద్దిల గురుమూర్తి – ఎస్సీ మాల
చిత్తూరు – ఎన్‌ రెడ్డప్ప – ఎస్సీ మాల
రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి – ఓసీ రెడ్డి
కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి – ఓసీ రెడ్డి
కర్నూలు – బివై రామయ్య – బీసీ బోయ
నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి – ఓసీ రెడ్డి
హిందూపుర్‌ – జోలదరసి శాంత – బీసీ బోయ
అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ – బీసీ కురుబ
కాగా అనకాపల్లి సీటు మాత్రం ప్రకటించలేదు. పెండింగ్‌లో ఉంచారు.
Next Story