చిత్తూరు నగరంలోని లక్ష్మి సినిమా హాల్ సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు తుపాకులతో మంగళవారం తెల్లవారుజామున స్వైరవిహారం చేశారు. ఇంటి యజమాని అప్రమత్తతో పోలీసులకు సమాచారం అందింది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా ఎస్పీ మణికంఠ చందోలు సాయుధ సిబ్బందితో రంగంలోకి దిగారు.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన సాయుధ పోలీసులు ఒకపక్క. అధునాతన ఆయుధాలతో ఇంటిని చుట్టుముట్టిన మరో పోలీసు బృందాలు. ఉగ్రవాదులను వేటాడిన రీతిలో పోలీసులు చేతిలో తుపాకుల సిద్ధంగా ఉంచుకొని దొంగలను పట్టుకుని ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్న దోపిడి దొంగల్లో ముగ్గురిని పట్టుకున్నారు. ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపిన వారు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియని స్థితిలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సుక్షిత కమాండవులు నిచ్చెనల సాయంతో ఇంటి పైకి ఎక్కారు. చేతిలో పిస్టళ్ళు, మరోపక్క సెల్ఫ్ లోడెడ్ రైఫిల్స్ ( self loaded trifles slr's) ఏం చేసినా యువ పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.
ఇంట్లో ప్రతిధ్వనించిన కాల్పులు
చిత్తూరు నగరం లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్ వరల్డ్ షాప్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దూరిన దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఓ వ్యక్తి గాయపడ్డారు. ఈ శబ్దాలు విన్న చుట్టుపక్కల వారు ఏమి జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. కాల్పుల కలకలం నగరం మొత్తం వ్యాపించింది. గాయపడిన వ్యక్తిని ఇంటి పైభాగం నుంచి అతి కష్టం మీద కిందికి తీసుకొని వచ్చిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు సారధ్యంలో రంగం లోకి దిగిన సాయుధ పోలీసులు ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకెంత మంది ఉన్నారనే విషయం తెలియని స్థితిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. లక్ష్మీ సినిమా హాల్ ఉన్న ప్రాంతమంతా పోలీసులతో నిండిపోయింది.
ఇంట్లోకి చొరబడిన దుండగులు జరిపిన కాల్పుల వల్ల ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో గందరగోళం నెలకొంది. దుండగులను అవసరమైతే అంతం అందించడానికి కూడా ఏమాత్రం విరమణ స్థితిలో సాయిధ పోలీసులు ధైర్యం చేసి ఇంట్లో పడ్డారు. పరిస్థితి అదుపులోకి రాకుంటే పొగ బాంబులు వేసి అయినా సరే దుండగులను పట్టుకోవడం లేదా అంతమందించడానికి పోలీసులు సమాహిత్తమై రంగం లోకి దిగినట్లు అక్కడి యుద్ధ వాతావరణం చెప్పకనే చెబుతోంది.
ఆయుధాలు స్వాధీనం
పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని ఇంట్లోకి చొరబడిన దుండగుల నుంచి పోలీసులు రెండు తుపాకులతో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వీడియోలో వినిపించిన మాటలను బట్టి అర్థమవుతుంది. పట్టుబడిన దుండగులతో పాటు ఇంకెంత మంది ఉన్నారనే దిశగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన సంబంధించి ఆపరేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.