Tragedy| మరణంలోనూ ఆ ముగ్గురూ స్నేహితులే..
x
అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జరిగిన ప్రమాదం

Tragedy| మరణంలోనూ ఆ ముగ్గురూ స్నేహితులే..

మంచు వల్ల దారి కనిపించక కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు స్నేహితులు మరణించారు. జీపీఎస్ సందేశంతో వారి కుటుంబీకులు అప్రమత్తం అయ్యారు.


విహారయాత్రకు కలిసి వెళ్లిన నలుగురు మిత్రులు స్వప్రాంతానికి వచ్చారు. కారులో బయలుదేరిన వారిని మృత్యువు వెంటాడింది. వారిలో ముగ్గరు స్నేహితులు మరణిస్తే, మరోకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ప్రమాదానికి గురైన విషయం జీపీఎస్ ద్వారా సందేశం అందుకున్న వారి కుటుంబీకులు పోలీసులను అప్రమత్తం చేశారు. మంచుదుప్పటి కమ్మేసిన మసకచీకటిలో సిగ్నల్ ఆధారంగా ప్రమాదానికి గురైన కారు ఆచూకీ తెలుసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలివి.

కర్ణాటక రాష్ట్రం బళ్ళారి కి చెందిన స్నేహితులైన ముగ్గురు డాక్టర్లు, ఓ లాయర్ హాంకాంగ్ టూర్ కి వెళ్లారు. తిరిగి వారు బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో తిరిగి బళ్లారికి బయలుదేరారు. వర్షాకాలం కావడంతో మంచి దుప్పటి కమ్మేసింది. అది కూడా వారు వేకువజామున ప్రయాణిస్తుండడంతో మంచు వల్ల దారి కనిపించలేదు. ఆ వేగంలో ..

అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది. కారు ఢీకొన్న ధాటికి చెట్టు కూడా విరిగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జేసీబీ సాయంతో కారును పక్కకు లాగిన పోలీసులు అందులో ఇరుక్కుపోయిన వారిని బయటికి తీశారు. అప్పటికే కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మరణించిన వారిని బళ్ళారిలోని ఓపిడి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లుగా పోలీసులు గుర్తించారు. అందులో డాక్టర్లు యోగేష్, గోవిందరాయ, న్యాయవాది వెంకట నాయుడు మరణించారని వారి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా గుర్తించారు. వారితో పాటు ప్రయాణిస్తున్న డాక్టర్ అమర తీవ్రంగా గాయపడ్డారు. అతనిని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా బళ్ళారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసుల ద్వారా సమాచారం అందింది.

జీపిఎస్ సందేశంతో...

ప్రమాద స్థలాన్ని గుర్తించగానే, తమ వారి మృతదేహాలను చూసిన సంబంధీకులు కన్నీరుమున్నీరయ్యారు. వారికి అందిన జీపీఎస్ మెసేజ్ వల్లే, సంఘటనను గుర్తించి, పోలీసులను అప్రమత్తం చేయగలిగారు. ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ముగ్గురు మరణించినట్లు సంఘటన జరిగిన తీరు చెప్పకనే చెబుతోంది.

విహారయాత్ర ముగించుకున్న డాక్టర్ల బృందం బెంగళూరు నుంచి బళ్లారికి బయలుదేరింది. అందులో ముగ్గురు డాక్టర్లు ఒక న్యాయవాది ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి బళ్లారి నుంచి ఒకరు బెంగళూరుకు వెళ్ళింది. ఆ కారుకు జీపీఎస్ సిస్టం ఉండడం వల్లనే వారు ప్రమాదానికి గురైన సమాచారం కుటుంబ సభ్యులకు అందేలా చేసింది.

బెంగళూరు నుంచి ముగ్గురు డాక్టర్లు యోగేష్, గోవిందరాయ, అమరేష్ గౌడ, న్యాయవాది వెంకట్ నాయుడు కార్లో బళ్లారికి బయలుదేరారు. ఆదివారం వేకువజామున 42వ జాతీయ రహదారిపై వీరి కారు ప్రయాణం చేస్తుంది. పొగ మంచు ఎక్కువగా ఉండడంతో ఈ కారు చెట్టును ఢీకొని వారిలో ముగ్గురు చనిపోగా, న్యాయవాది వెంకట్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు.
కారు ప్రమాదానికి గురికాగానే వారి ఐఫోన్ నుంచి ఆదివారం వేకువజామున 3.25 గంటలకు బాధితుల ఐఫోన్ నుంచి కుటుంబీకులకు ఓ మెసేజ్ వెళ్ళింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వారి కుటుంబీకులు తమ వారు ఆపదలో ఉన్నారని గ్రహించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో బళ్ళారి నుంచి జీపీఎస్ ఆధారంగా మృతుల సంబంధీకులు ప్రమాది స్థలానికి చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఒక మంచి ఎక్కువగా ఉండడంతో కారు ఎక్కడ పడిపోయిందో కూడా తెలియని స్థితిలో గాలింపు మొదలుపెట్టారు. అప్పటికే ఘటన స్థలానికి చేరుకున్న విడపనగల్లు పోలీసులు వాహనాన్ని గుర్తించారు. ఆ తర్వాత చనిపోయిన ముగ్గురిని బళ్ళారి విమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు తీవ్రంగా గాయపడిన డాక్టర్ అమ్రేష్ గౌడ్ ను కూడా చికిత్స కోసం తీసుకువెళ్లారు.

విహారయాత్రకు వెళ్లిన డాక్టర్ల కుటుంబాల్లో ఈ ప్రమాదం విషాదం నింపింది. కారుకు ఉన్న జిపిఎస్ ఆధారంగా ప్రమాద స్థలాన్ని గుర్తించడంతోపాటు తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తిని కూడా అత్యవసర చికిత్సకు తరలించడానికి ఆస్కారం కలిగింది.
Read More
Next Story