
Breaking | ముగ్గురు దళితుల హత్య
పరస్పర దాడుల్లో ఒకు కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు.
రెండు కుటుంబాల మధ్య చెలరేగిన వాగ్వాదం గొడవగా మారింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు కుటుంబాలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
ఈ దాడుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటనతో ఎస్సీపేటలో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన వివరాలివి.
ముగ్గురు హత్యకు గురైన ఘటన నేపథ్యంలో వేట్లపాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకు న్న పోలీసులు ఆ గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది. ప్రాధమిక సమాచారం మేరకు...
వేటపాలెం ఎస్సీపేటలో దాదాపు 20 మంది కలిసి కత్తులు, కర్రలతో ప్రత్యర్థి కుటుంబంపై దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని ఎస్సీపేట చెరువు వద్ద కరాదాల పండు ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబీకులు ప్రయత్నించారు. ఇంటి స్థలం విషయంలో కరాదాల, బచ్చల కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తులతో దాడి చేసుకోవడంతో కరాదాల ప్రకాశ్‌రావు(50).. అక్కడికక్కడే మృతి చెందగా, చంద్రరావు(60), ఏసు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర గాయాలైన బచ్చల చిన్నసుబ్బారావు, కరాదాల పండు, బాబీలు చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో కత్తులు, కర్రలు స్వాధీనం చేసుకున్న సామర్లకోట పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పరిశీలించారు.
Next Story