
తిరుచానూరు: స్వర్ణరథంపై దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
ఉపయాల్లో విశేష ఉత్సవాలను ప్రకటించిన టీటీడీ వరలక్ష్మీవ్రతానికి ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమల, తిరుపతి తోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఏడాది పొడవునా విశేష ఉత్సవాలు నిర్వహిస్తూను ఉంటారు. ఆగమశాస్త్రానికి అనుగుణంగా నిర్వహించే ఉత్సవాలకు శుభముమూర్తాల ప్రకారం కార్యక్రమాలను టీటీడీ ఖరారు చేస్తుంది. అందులో భాగంగానే తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉప ఆలయాల్లో ప్రత్యేక రోజుల్లో విశేష ఉత్సవాల నిర్వహణకు టీటీడీ కార్యక్రమాల షెడ్డూల్ ప్రకటించింది. అందులో భాగంగా.. ఆగష్టు 8వ తేదీ వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నారు. అదే రోజు పద్మావతీ అమ్మవారు స్వర్షరథంపై ఊరేగుతూ, భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
పద్మావతీ అమ్మవారి ఆలయం
ఆగస్టు ఒకటో తేదీ, 15, 22, 29వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు.
ఆగస్టు 8న ఉదయం 10 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం. సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది.
సుందరరాజ స్వామి ఆలయం: ఆగస్టు 13న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్రహించనున్నారు.
బలరామ కృష్ణ స్వామి వారి ఆలయం: ఆగస్టు 16న గోకులాష్ఠమి సందర్భంగా పెద్దశేష వాహనంపై స్వామివారు కటాక్షించనున్నారు.
ఆగస్టు 17న ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.
సూర్యనారాయణ స్వామి ఆలయం: ఆగస్టు 26న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయం: ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీలలో వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు అభిషేకం.
ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట : ఆగస్టు 1, 8, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం. నిర్వహించనున్నారు.
ఆగస్టు 3, 10, 17, 24, 31వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం జరుగుతుంది.
ఆగస్టు 5: మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
ఆగస్టు 9న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.
ఆగస్టు 13న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం.
Next Story