![CBI on adulterated ghee | కల్తీ నెయ్యి పాపం.. నోటీసులతో ప్రకంపనలు! CBI on adulterated ghee | కల్తీ నెయ్యి పాపం.. నోటీసులతో ప్రకంపనలు!](https://telangana.thefederal.com/h-upload/2025/02/11/512058-whatsapp-image-2025-02-11-at-42058-pm.webp)
CBI on adulterated ghee | కల్తీ నెయ్యి పాపం.. నోటీసులతో ప్రకంపనలు!
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో సీబీఐ దూకుడు పెంచింది. మాజీ అధికారికి ముందే టీటీడీలో కొందరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో కల్తీ నెయ్యి వాడారనే కేసులో సీబీఐ దూకుడు పెంచింది. మొదటగా నలుగురు పాల కర్మాగారాల యజమాలను అరెస్ట్ చేసింది. కొనుగోలు, ఆర్థిక వ్యవహారాల ఫైళ్లు నడిపిన టీటీడీ అధికారులపై సిబిఐ దృష్టి సారించింది. ఇప్పటికే 10 మందికి పైగానే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీరి తర్వాత నిర్ణయాలు చేసిన రాజకీయ ప్రతినిధులు, టీటీడీలో కీలక పాత్ర పోషించిన మాజీ అదనపు ఈవో పై చర్యలకు దిగడానికి రంగం సిద్ధం చేయడానికి దర్యాప్తులో వేగం పెంచినట్లు తెలుస్తోంది.
2024 సెప్టెంబర్ 18 కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు శాసనసభాపక్ష సమావేశంలో..
"తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారు" అని చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
సెప్టెంబర్ 27 : శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అభియోగాలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 470/24 తో కేసు నమోదు అయింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గుూంటూరు రేజం్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ సారధ్యంలో తొమ్మిది మందితో నియమించిన సిట్ ( special investigate team - SIT) దర్యాప్తు చేసింది. ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ లోపు సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది.
రంగంలోకి సీబీఐ
సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ జాయింట్ డైరెక్టర్ విరేష్ ప్రభు సారధ్యంలోని ఏపీ పోలీసు అధికారులతో కూడిన సిట్ రంగం లోకి దిగింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కేసు టెక్ ఓవర్ చేసిన సిబిఐ తిరుపతి నగరం అలిపిరికి సమీపంలోని పాత ఎస్విబిసి కార్యాలయం వేదికగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించింది. మొదట టీటీడీ ఈవో జె శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తోపాటు టిటిడిలో ఆర్థిక వ్యవహారాల అనుమతి మంజూరు చేసే అధికారులు, తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు, బూంది తయారుచేసే పోటు ( వంటశాల) డిప్యూటీ ఈవో నుంచి వివరాలు సేకరించారు.
వివరాల సేకరణ
టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీల వివరాలు తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయానికి సరఫరా చేసిన వివరాలతో పాటు, వారికి నగదు చెల్లింపు లావాదేవీలను కూడా అధ్యయనం చేసింది. నెయ్యి కొనుగోలుకు సంబంధించి అనుసరించే విధానాలు, పద్ధతులతో పాటు టెండర్ల జారీ చేసిన విధానం కూడా సిబిఐ అధికారుల సారధ్యంలోని సిట్ బృందం పూర్తి వివరాలు తీసుకుంది.
కింది నుంచి విచారణ
తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సిబిఐ సాగించిన దర్యాప్తు కూకటివేళ్లను పెకిలించే విధంగా ఉందని భావిస్తున్నారు. తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ సంస్థను సిబిఐ అధికారుల బృందం పరిశీలించింది. అక్కడ వారి పాల సేకరణ. నెయ్యి ఉత్పత్తి. ఆ టాంకర్లతో తిరుమలకు తరలింపులో జరిగిన అనేక అపసవ్య పరిస్థితులను సిబిఐ గుర్తించింది.
విస్తుపోయే నిజాలు
లడ్డు ప్రసాదం తయారీలో ప్రైవేటు కర్మాగారాల యజమానులు అనుసరించిన తీరు ఏ విధంగా సాగించారనే విస్తుపోయే నిజాలను సిబిఐ తన నివేదికలో స్పష్టం చేసింది. నెయ్యి సేకరణ. టీటీడీకి సరఫరా. వంటి విషయాల్లో జరిగిన అక్రమాలను నిర్ధారిస్తూ సిబిఐ నలుగురిని అరెస్ట్ చేసింది. వారిలో ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కి ప్రాంతానికి చెందిన హోలీ బాబా డైరీ కి డైరెక్ట్ గా పనిచేసిన బిపియన్ జైన్, పోమెల్ జైన్, పూనం భాగం సమీపంలోని వైష్ణవి డైరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డ, తమిళనాడు రాష్ట్రం దుండిగల్ సమీపంలోని ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్ ను సిబిఐ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించింది.
ఆరోపణలు ఇవి
"ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరిపడా టెండర్లు తగ్గించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు నకిలీ పత్రాలు వాడారు. ఏ ఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సీడ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపించారు" అనేది సిబిఐ అభియోగం.
రూర్కి లోని బోలె బాబా సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసిన్నట్లు వైష్ణవి డైరీ ప్రతినిధులు దొంగ రికార్డులు సృష్టించారని సిబిఐ గుర్తించింది. "ఆ నెయ్యిని ఏఆర్ డైరీ నుంచి మరో మార్గంలో సరఫరా చేయడంలో వైష్ణవి పాల ఉత్పత్తి కర్మాగారం ప్రతినిధులు వక్రమార్గాలు అనుసరించారు" సి.బి.ఐ అభియోగం. అయితే బోలె బాబా మిల్క్ డైరీ కి అంత సామర్థ్యం లేదనే విషయం సిబిఐ తన దర్యాప్తులో గుర్తించినట్లు చెబుతున్నారు. మూడు పాల కర్మాగారులకు చెందిన పాల కర్మాగారాల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిని మరింతగా విచారించడానికి సిబిఐ అధికారులు తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీరిని మరింత లోతుగా విచారించడం ద్వారా నెయ్యి సరఫరా, టెండర్ల వ్యవహారంలో ముడుపుల బాగోతం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే
పదిమందికి నోటీసులు?
ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు కు టీటీడీలో కొన్ని విభాగాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అందులో మార్కెటింగ్ విభాగం. ఆర్థిక శాఖ. తిరుమల పోటు అధికారుల మధ్య ఫైల్స్ నడుస్తాయి. అలాగే టిటిడి నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ సెల్ కు కూడా బాధ్యత ఉంటుంది. నెయ్యి కొనుగోలు ఏమి జరిగింది అనే తెలుసుకునేందుకు ఇవి భాగాల సిబ్బందితోపాటు అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
తర్వాత ఎవరు..?
టిటిడిలో సాధారణంగా ఉప్పు నుంచి పప్పు వరకు ఏది కొనుగోలు చేయాలన్నా పూర్చేజింగ్ కమిటీ (TTD purchasing committee) ఉంటుంది. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఆ తర్వాత మరో మాజీ చైర్మన్, వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి సారధ్యంలో నిర్ణయాలు జరిగాయి. ఆ ఇద్దరూ టీటీడీ చైర్మన్గా పనిచేసిన కాలంలో పాలకమండలిలో సభ్యులుగా ఉన్న వారితోపాటు అధికారులతో కూడిన పర్చేజింగ్ కమిటీ దిండిగల్ లోని ఏఆర్ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ సంస్థలు పరిశీలించింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ బోర్డులో తీర్మానం ఆమోదించారు. ఆ తీర్మానం యువ కార్యాలయం నుంచి టిటిడి ఫైనాన్సు డిపార్ట్మెంట్ కు వెళ్ళింది. అంటే ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే ఇంతటి ప్రాసెసింగ్ ఉంటుంది.
అప్పటి వారే ఇప్పుడూ..
అప్పటి పాలకమండలిలో సభ్యులుగా ఉన్నవారిలో ప్రస్తుతం టిడిపి కూటమిలో రాష్ట్ర సమాచార మంత్రి కొలుసు పార్థసారథి, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి తో పాటు తమిళనాడులో బిజెపి కీలక నాయకుడైన వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా పర్ఛేజింగ్ కమిటీలో సభ్యులుగా పనిచేసిన వారే. తాజా పాలకమండలిలో కూడా వారు సభ్యులు గానే ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లో మంత్రివర్గం తీసుకునే రాజకీయ నిర్ణయాలను అధికారులు ఎలా అమలు చేస్తారో.. టీటీడీలో కూడా రాజకీయ ప్రతినిధితో కూడిన పాలకమండలి చేసిన తీర్మానాలను టీటీడీ కార్యనిర్వహణాధికారి (TTD educative officer) అమలు చేస్తారు. అయితే,
టిటిడి పాలక మండలి చేసిన తీర్మానాలను ఈ టూర్ చేసే అధికారం కూడా ఈవోకు ఉంటుందనేది అధికారులు చెప్పే మాట. ఎందుకు అంటే శ్రీవారి సొమ్ము వృధా కాకుండా నివారించడానికి, ఆ తీర్మానం నిలువరించే అధికారం ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ అదనపు ఈవోగా పూర్తి బాధ్యతలు నిర్వహించిన ఏవీ ధర్మారెడ్డి అనుసరించిన తీరుపై అనేక విమర్శలు ఉన్నాయి. ఆరోపణలు కూడా లేకపోలేదు.
"ఆనాటి వైసిపి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఆయన నిర్ణయాలు అమలు చేశారు. దీనివల్ల శ్రీవారి నిధులు దుర్వినియోగం అయ్యాయి. నెయ్యి కొనుగోలులో కూడా అదే జరిగింది" అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిబిఐ దర్యాప్తులో నెయ్యి సరఫరాలో ఆయా సంస్థలు, కొనుగోలులో టీటీడీ అధికారులు పాటించిన పద్ధతులతో ఈ పరిస్థితి ఏర్పడిందని విస్తూ పోయే నిజాలను సిపిఐ తన చార్జిషీట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో నెయ్యి కొనుగోలులో ఏ రకంగా వ్యవహరించిన విభాగాలు అధికారుల విచారణ అనంతరం రాజకీయ ప్రతినిధులను టార్గెట్ చేసేది గాని దర్యాప్తును కింది నుంచి పైకి సాగిస్తున్నట్లు భావిస్తున్నారు. మొత్తానికి ఈ కోసం కేసును రోజుల వ్యవధిలోని తేల్చే దిశగా వైసిపి మాజీ ప్రతినిధులకు ఊపిరి సలపని ఇవ్వని విధంగా అన్ని ఆధారాలతో దర్యాప్తు సాగించడానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. టీటీడీ అధికారుల విచారణ అనంతరం ఎలాంటి సంచలన విజయం విషయాలు బహిర్గతం అవుతాయో వేచి చూడాల్సిందే.
Next Story