
Tirumala Parakaamani Thrft case | అజ్ణాతం వీడిన నిందితుడు రవికుమార్..
మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఏమి చెప్పాడంటే...
తిరుమల పరకామణిలో చోరీ జరిగిన వ్యవహారం సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీవి. రవికుమార్ శనివారం రెండేళ్ల నోరు విప్పారు.
జీయర్ గుమాస్తాగా పనిచేసిన రవికుమార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి
"నేను తప్పు చేశాను. పరిహారం చెల్లించాను. జీయర్ మఠంలో గుమాస్తాగానే కాకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన సొమ్ములో 90 శాతంటీటీడీకి సమర్పించా" అని పరకామణి చోరీలో నిందితుడు రవికుమార్ స్పష్టం చేశారు.
ఆయన వీడియో సందేశం వెనుక అంతరార్థం ఏమిటనేది కూడా చర్చకు దారితీసింది.
జగన్ మాటలతో ధైర్యమా.. భూమన ప్రశ్నలు ధైర్యం ఇచ్చాయా.?
"ఈ కేసు చాలా చిన్నది" అని మాజీ సీఎం వైఎస్. జగన్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం. ఆ తరువాత టీటీడీ మాజీ చైర్మన్, వైఎసీపీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన 24 గంటలు కూడా తిరగముందే పరకామణి చోరీ నిందితుడు రవికుమార్ ప్రాధాన్యత సంతరించుకుంది. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.

