ఏపీలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌. రైలులో అక్రమ రవాణా చేస్తున్న ముఠా.


ఆంధ్రప్రదేశ్‌లో ఓ పెద్ద హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ను పోలీసులు బ్రేక్‌ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఓ ట్రైన్‌లో తరలిస్తున్న బాలికలను పోలీసులు సేవ్‌ చేశారు. దీంతో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు రట్టైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కిరండోల్‌–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం అందుకు రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దాడులు నిర్వహించారు. రైలులో తనిఖీలు చేపట్టారు. చాకచక్యంగా పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న 11 మంది మైనర్‌ బాలికలను రక్షించారు. ఈ మైనర్‌ బాలికలను తమిళనాడుకు తరలించేందుకు ముఠా తెగబడింది. ఈ ముఠాకు చెందిన నిందితుడు రవి బిసోయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు కాపాడిన 11 మంది మైనర్‌ బాలికలు ఒడిశాలోని నవరంగ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన చిన్నారులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం విశాఖపట్నం రైల్వే పోలీసులు ఈ కేసును ఒడిశా పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

Next Story