
కర్నూలు బస్సు దగ్ధం ఘటనతో కదిలిన రవాణా శాఖ
ఆకస్మిక తనిఖీలతో ప్రయివేటు బస్సు యాజమానులపై 289 కేసుల నమోదుతో రూ.708 జరిమానా విధింపు.
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన తర్వాత రాష్ట్ర రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయడం ప్రారంభించారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు 289 కేసులు నమోదు చేశారు. అన్ని బందులను అతిక్రమించిన బస్సుల యాజమాన్యాల నుంచి 7.08 లక్షల రూపాయల వరకు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న కారణంగా 18 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా రవాణా శాఖ అధికారులు (transport department) సీజ్ చేశారు.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం వద్ద శుక్రవారం తెల్లవారుజామున వి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం, బస్సు డ్రైవర్లతో సహా 27 మంది ప్రయాణికులు గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడి జనరల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
"వారికి మెరుగైన చికిత్స అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం" అని సంఘటన స్థలాన్ని పరిశీలించిన సమయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ప్రమాదాలు జరగకుండా నివారించడానికి హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు కళ్లెం వేయడానికి కూడా చర్య తీసుకుంటామని ఆమె ప్రకటించారు.
కర్నూలు బస్సు దగ్ధం సంఘటనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఘటన స్థలాన్ని పరిశీలించి, మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించే దిశగా ఆర్టిఏ అధికారులు (road transport department) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తనిఖీలు ముమ్మరం..
కర్నూలు సంఘటనతో రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ జిల్లాలో విస్తృతంగా ఆర్టిఏ అధికారులు ప్రైవేటు బస్సులను తనిఖీ చేపట్టారు. నిబంధనలు అతిక్రమించిన బస్సుల యాజమాన్యాలకు జరీమానాలు విధిస్తున్నారు. రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో శనివారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల ద్వారా 289 కేసులు నమోదు చేశారు. ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి అవసరమైన అత్యవసర ద్వారా లేకపోవడాన్ని కర్నూలు బస్సు దగ్ధం ఘటన ఎత్తి చూపించింది.
ఈ కారణాన్ని ప్రధానంగా గమనించిన ఆర్టిఏ అధికారులు 13 బస్సుల యాజమాన్యాలపై కేసులో నమోదు చేశారు. అందులో చిత్తూరు జిల్లాలో 22 కేసులు నమోదు చేసినట్లు ఆర్టిఏ అధికారులు చెప్పారు. కర్నూలు జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.
నంద్యాల జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. శ్రీకాంత్ తెలిపారు.
"భద్రతా ప్రమాణాలు పాటించని బస్సుల యాజమాన్యాలపై చర్యలు తప్పవు"అని mvi శ్రీకాంత్ స్పష్టం చేశారు.
కోస్తా జిల్లాలపై ఎఫెక్ట్..
కర్నూలు బస్సు దగ్ధం ఘటన ప్రజానీకాన్నే కాదు ప్రభుత్వాన్ని కూడా కలవడానికి గురిచేసింది. రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు ఎక్కువగా విజయవాడ గుంటూరు వైజాగ్ హైదరాబాద్ నుంచి నడుపుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో రెండు మూడు ట్రావెల్ సర్వీస్ లు మాత్రమే ఉన్నాయి. కర్నూలు బస్సు దగ్ధం ఘటన తర్వాత ఏలూరు జిల్లాలో అత్యధికంగా 55 కేసులు నమోదైనట్లు రవాణా శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఇక్కడే మూడు బస్సులు కూడా సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 కేజీలు నమోదు చేసిన రవాణా శాఖ అధికారులు నాలుగు బస్సులను సీజ్ చేశారు. కోనసీమ జిల్లాలో కూడా 207 కేసులు నమోదయ్యాయి.
పత్రాలు ఎక్కడ..
రాష్ట్రంలో ప్రైవేటు బస్సులను నడిపే యాజమాన్యాలు కచ్చితంగా వాహనం వెంట సరైన పత్రాలు అందుబాటులో ఉంచాలి. అందులో బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ (fitness certificate), రూట్ పర్మిట్ route permit ), tax certificate, driver licence వంటివి కచ్చితంగా బస్సులో అందుబాటులో ఉంచాలి. వీటిలో సరైన పత్రాలు లేవని కారణంతో ఎనిమిది బస్సులకు, ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సులువుగా తప్పించుకోవడానికి అత్యవసర ద్వారం లేని 13 బస్సులకు, అగ్ని ప్రమాదం జరిగితే పరికరాలు అందుబాటులో ఉంచని 103 బస్సులు, బస్సులో ప్రయాణికులు ఉన్న, ఆ వివరాలకు సంబంధించిన వారి వివరాలు అందుబాటులో ఉంచని 34 బస్సులు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన 127 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ సూచనల మేరకు తనిఖీలు సాగిస్తాం. "నిబంధనలు ఉల్లంఘించిన బస్సుల యాజమాన్యాలపై చర్యలు తప్పవు" అని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొరపాటి మురళీమోహన్ ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేయడానికి తగినంత మంది సిబ్బంది ఉన్నారని ఆర్టీవో మురళీమోహన్ తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు.
Next Story

