TTD | తిరుమల శ్రీవారికి అందుతున్న విరాళాలు ఏమి చేస్తున్నారంటే..
x

TTD | తిరుమల శ్రీవారికి అందుతున్న విరాళాలు ఏమి చేస్తున్నారంటే..

టీటీడీ ట్రస్టుల ద్వారా యాత్రికుల ఆకలి తీరుస్తున్నారు. విద్యకు ఊతం, ప్రాణదాతలు అవుతున్నారు.


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి దేశ, విదేశాల్లో ఉన్న భక్తులకు కొదవ లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలోనే విరాళాల రూపంలో కోట్లాది రూపాయలు దాతలు సమర్పిస్తున్నారు.

మనిషి జీవించడానికి అన్నం, జ్ణానం కోసం చదువు, ఆరోగ్యం అనేది అందరికీ తెలిసిందే. ఈ మూడు పథకాల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన ట్రస్టులకు దాతలు విరాళాలతో ఊతం ఇస్తున్నారు. టీటీడీ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది. ఈ ట్రస్టు కోసం..
రాజమండ్రికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, సరోజినీదేవి దంపతులు 1.01 కోట్ల రూపాయల విరాళం చెక్కు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి తిరుమలలో బుధవారం విరాళం చెక్కు అందించారు.

"ఈ నిధులు టీటీడీ పేద విద్యార్థుల కోసం నిర్వహించే విద్యా సంస్థల్లో మెరుగైన బోధనకు వినియోగించండి" అని దాత నున్న తిరుమలరావు టీటీడీ అధికారులను కోరారు. "టీటీడీ నిర్వహిస్తున్న విద్యాదాన ట్రస్టుకు కానుక సమర్పించడం" ఆనందంగా ఉందని తిరుమలరావు వ్యాఖ్యానించారు.
ఎన్నో ట్రస్టులు
దాతలు అందించిన విరాళాలతో టీటీడీ యాత్రికుల కోసం అన్నప్రసాద ట్రస్టు, ఎస్వీ ఆరోగ్య ప్రసాదిని, విద్యాదానం, ధార్మిక కార్యక్రమాల కోసం సుమారు పది ట్రస్టుల వరకు నిర్వహిస్తోంది. ఈ ట్రస్టులకు దాతలు అందించే విరాళాలను పిక్స్ డ్ డిపాజిట్ చేయడం ద్వారా, వచ్చే వడ్డీతో ఆ ట్రస్టుల ద్వారా టీటీడీ కార్యకలాపాలు సాగిస్తోంది. అందులో భాగంగానే రాజమండ్రికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ తిరుమలతిరావు కూడా విద్యాదాన ట్రస్టుకు తమ వంతు కానుకగా 1,01,11,111 రూపాయల చెక్కు సమర్పించారు.
దాతలకు శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అందించారు. ఆర్థిక సామర్థ్యం కలిగిన వారు టీటీడీకి అందిస్తున్న విరాళాలు భారీగానే ఉంటున్నాయి. ఈ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దాతలు ఊతం ఇస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం కూడా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన గౌరవ్ ఐరెన్ రూ. 10,11,111 సర్వశ్రేయస్ ట్రస్టుకు కానుకగా సమర్పించారు.
పదేళ్లలో 2000 కోట్లు
తిరుమలలో ఆకలి అనే పదానికి ఆస్కారం ఉండదు. దీనికోసం టీటీడీ శ్రీతరగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తోంది.
1985 లో అన్నదానం కార్యక్రమాన్ని మాజీ సీఎం ఎన్టీ. రామారావు రెండువేల మంది యాత్రికులకు అన్నదానం చేసే సామర్థ్యంతో ప్రారంభించారు. 2014లో శ్రీవెంకటేశ్వర నిత్యాన్న ట్రస్టు ఏర్పాటు చేశారు. కేవలం పదేళ్ల కాలంలోనే ఇబ్బుడిముబ్బడిగా విరాళాలు సమర్పించారు. ఇప్పటికే దాతల సంఖ్యం 9.7 లక్షల మందికి చేరింది. విరాళాల మొత్తం కూడా 2,200 కోట్లు దాటింది.
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మాటల ప్రకారం
"కోటి రూపాయలకు పైగా కానుకలు సమర్పించిన దాతల సంఖ్య 139 మందికి చేరింది" అని ఐదు రోజుల కిందట ప్రకటించారు. రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య దాటినట్టు దాతలు సమర్పించిన విరాళాలే సాక్ష్యం.

"ఒక రోజు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాలకు రోజు రూ. 44 లక్షలు అవుతుంది. దీనికోసం విరాళం ఇచ్చిన దాతలు ఇప్పటి వరకుయ 249 మంది ఉన్నారు" అని చెప్పారు. "యాత్రికులకు రుచికరమైన ఆహారపదార్థాలు వడ్డించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అన్నం సాంబారు, తీపి పదార్థం, పచ్చడి, రసం, మజ్జిగకు తోపాటు అదనంగా వడను కూడా వడ్డిస్తున్నాం" అని బీఆర్. నాయుడు చెప్పారు.
ప్రాణదానానికి దాతల పోటీ
తిరుమల శ్రీవారికి విరాళాలు అందించడంలో దాతలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( Sri Venkateswara Institute of Medical Sciences - Svims ) పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తోంది. వైద్య సేవల అనంతరం రోగులకు బిల్లలు కనీసంగా అంటే 30 శాతం రాయితీ ఇచ్చే సదుపాయం ఇక్కడ ఉంది. అయితే, గుండె శస్ర్తచికిత్సలు, ఇతర ప్రాణాంతక రోగాల నుంచి కాపాడేందుకు ఈ ఆస్పత్రి సేవలు అందించడంలో ముందు ఉంటుంది. అందులో భాగాంగానే శ్రీబాలాజీ ప్రాణదాన ట్రస్టు ( TTD Sri Balaji Pranadana Trust ) ను స్విమ్స్ లో టీటీడీ మాజీ చైన్మన్ డీకే. ఆదికేశవులు నాయడు కాలంలో స్వయంగా ఆయనే రూ. పది లక్షల కార్సస్ ఫండ్ తో ప్రారంభించారు ఈ ట్రస్టు ద్వారా పేద రోగులకు వైద్య సేవలు అందించడానికి స్విమ్స్ డైరెక్టర్ సిఫారసుపై ఎందరికో ప్రాణదానం చేశారు. దీంతో ఈ ట్రస్టుకు కూడా దాతల నుంచి విరాళాలు అందుతున్నాయి.
హైదరాబాద్ కు చెందిన ఎనర్ టెక్ కాంసెట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ అధినేత ఏవీ. రమణరాజు ఈ నెల 21వ తేదీ ఒక కోటి, 1,116 రూపాయలు కానుకగా సమర్పించారు. ఈ నిధులు టీటీడీ నిర్వహించే బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు వినియోగించాలని దాత ఏవీ. రమణరాజు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడును కోరారు.
కర్ణాటక రాస్ట్రం బళ్లారికి చెందిన శ్రీశ్రీనివాస కన్ స్ట్రక్షన్ ఇండియ ప్రైవేటు ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు ఈ నెల 25వ తేదీ 1,01,11,111 రూపాయల చెక్కులు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందించారు. ఈ నిధులు కూడా ప్రాణదానం, విద్యాదానం, అన్నదానం ట్రస్టులకు వినియోగించాలని దాతలు అభ్యర్థించారు.
ఈ ఏడాది జనవరిలో చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్ ఐదు కోట్ల రూపాయలు టీటీడీకి విరాళంగా సమర్పించారు. "టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టుల్లో గోసంరక్షణ కోసం రూ. కోటి వెచ్చించాలని కోరారు. ధార్మిక కార్యక్రమాల ప్రచారం కోసం టీటీడీ నిర్వహిస్తున్న మీడియా సంస్థ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (Sri Venkateswara Bhakti Channel SVBC) కు నాలుగు కోట్ల రూపాయలు వినియోగించండి" అని కోరారు.
అరుదైన విరాళంగా రికార్డు
తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించే వారు సంపన్నులే ఎక్కువ. వివిధ రంగాల్లోని ప్రముఖులు ఉంటారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీటీడీకి అరుదైనం విరాళం అందింది. తిరుమల జిల్లా రేణిగుంటకు చెందిన మోహన అనే మహిళ భారత్ తోపాటు పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో అభివృద్ధి, విపత్తు నిర్వహణ రంగాల్లో పనిచేసిన అధికారి. ఒక్కసారిగా కాకుండా, తన జీవితంలో 35 ఏళ్ల పాటు ఆదా చేసిన రూ. 50 లక్షలు టీటీడీ శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ (TTD Sri Venkateswara Sarvasreyas Trust) (ఎస్వీ బాలమందిర్) ట్రస్టుకు కానుకగా సమర్పించడం ప్రత్యేకంగా నిలిచారు. "టీటీడీ విద్యా సంస్థల్లోని అనాథ, పేద పిల్లల చదువుకు ఈ విరాళం నిధులు వాడండి" అని అధికారులను కోరారు.
Read More
Next Story