ఆగస్టు నెలంతా తిరుపతిలో జరిగే ఉత్సవాలు..
x

ఆగస్టు నెలంతా తిరుపతిలో జరిగే ఉత్సవాలు..

తిరుమలలో ఆగస్టు నెల సందర్భంగా జరిగే మాస ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది.


కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి ఏటా ఉత్సవాలను అట్టహాసంగా చేస్తారు. తిరుపతి శ్రీవారికి ఈ ఏడాది అధికమాసం లేనందున సాలకట్ల బ్రహ్మోతసవం, నవరాత్రి బ్రహోత్సవం కలిసి ఒకే బ్రహ్మోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించేసింది. ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆగస్టు నెలలో శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కీలకంగా మారాయి. ఈ సందర్భంగానే ఆగస్టు నెల మాస ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు.

- ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.

- ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.

- ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.

- ఆగస్టు 10న కల్కి జయంతి.

- ఆగస్ట్ 11న శ్రీవారి పురుషైవారితోట ఉత్సవం.

– ఆగస్టు 13న గ‌రుడ‌పంచ‌మి, శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌.

– ఆగ’స్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్స’వం.

– ఆగస్ట్ 16న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.

– ఆగస్టు 17న శ్రీవారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

– ఆగస్టు 18 నుండి 20వ తేదీ వఱకు శ్రీవారి పవిత్రోత్సవాలు.

– ఆగస్ట్ 22న శ్రావణ పూర్ణిమ, విఖ‌న‌స మహాముని జయంతి.

– ఆగస్ట్ 23న శ్రీవారు శ్రీ విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు.

– ఆగస్ట్ 30న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం.

– ఆగస్ట్ 31న శ్రీవారి శిక్యోత్సవం.

Read More
Next Story