తిరుమలలో ముగిసిన టీటీడీ పాలకమండలి  సమావేశం..;
x

తిరుమలలో ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం..;

తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై టిటిడి పాలకమండలి ప్రత్యేకంగా సమావేశం అయింది. చైర్మన్ బీఆర్.నాయుడు అధ్యక్షతన బోర్డు సభ్యులు ఏర్పాట్లు భక్తులకు చెప్పటాల్సిన సౌకర్యాలపై చర్చించారు.


వైకుంఠ ఏకాదశి ఘటనల నేపథ్యంలో రథసప్తమి ఏర్పాట్లపై టిటిడి అప్రమత్తమైంది ఈ మేరకు ఈరోజు ప్రత్యేకంగా టిటిడి పాలకమండలి సమావేశం అయింది. ఈ సందర్భంగా రథసప్తమి నాడు చేపట్టబోయే ఏర్పాట్లపై టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు వివరాలు వెల్లడించారు. రథసప్తమికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏడు వాహనాలపై రథసప్తమి నాడు స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారని దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. 2 నుండి‌ 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్టుతెలిపారు. తిరుపతిలో జనవరి 8న దురదృష్ట ఘటనను దృష్టిలో పెట్టుకొని. రథసప్తమి నాడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రథసప్తమి నాడు అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు చైర్మన్ తెలిపారు.ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శన టోకన్లు జారీ నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు.1250 మంది పోలీసులు,1000 మంది ఇతర సిబ్బందితో రథసప్తమి కి భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు.భక్తుల‌ మధ్య తోపులాట్లకు తావులేకుండా ఆక్టోపస్, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఏపిఎస్పీ, అగ్నిమాపక దళాల ద్వారా నియంత్రణ చేపడతామన్నారు. వాహనసేవలను తిలకించేందుకు గ్యాలరీల్లో వేచిఉండే భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలు పంపిణీ చేస్తామన్నారు.8 లక్షల లడ్డూలు నిల్వ చేయాలని అధికారులకు అదే సాలు జారీ చేశామని తెలిపారు. మహాకుంభామేళా ప్రయాగ్ రాజ్ లో టీటీడీ నమూనా ఆలయం అద్భుతంగా ఉందని , శాస్త్ర యుక్తంగా నమూనా ఆలయంలో సేవలు పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.రోజుకు 10 వేల మంది భక్తులకు కుంభమేళ నమూనా ఆలయాన్ని దర్శించుకుంటున్నారన్నారు. తిరుమల తరహాలో అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నామని చైర్మన్ వెల్లడించారు



Read More
Next Story